ఏపీలో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి రెడీ అవుతున్నాయి. ఉద్యోగసంఘాలన్నీ కలిపి రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసులు ఇస్తామని ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమరానికి సై అంటున్నాయి అన్ని సంఘాలు. పీఆర్సీ వల్ల కలిగిన నష్టాలను పూడ్చాలని డిమాండ్ చేశాయి. నాలుగుజీవోలు రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా వుంటే… ఏపీ ఉద్యోగ సంఘ నేతలకు జీఏడీ సెక్రటరీ శశి భూషణ్ ఫోన్ చేశారు. రేపు మంత్రులతో…
ఏపీలో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకుంటోంది. తాజాగా అమరావతి నుంచి ప్రారంభం అయిన ఉద్యమం విశాఖ సాగరతీరానికి చేరింది. విశాఖ జిల్లా స్ధాయిలోనూ ఉద్యోగ జేఏసీలు ఏకమయ్యాయి. పీఆర్సీ సాధన సమితిగా ఏర్పాటయినట్టు సమితి కన్వీనర్ ఈశ్వర్రావు తెలిపారు. ఈనెల 25 న బైక్ ర్యాలీతో నగరమంతా నిరసన తెలుపుతామంటున్నారు. ఫిబ్రవరి 3 న ఛలో విజయవాడ తలపెట్టామన్నారు. తమ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లి వారి మద్దతు కూడగట్టుకుంటామన్నారు ఈశ్వరరావు. ఫిబ్రవరి 7 తేదీన…
సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన ఆ నాయకుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. మరోసారి కేబినెట్లో చోటుదక్కలేదన్న ఆవేదనో ఏమో.. సైలెంట్. ఇప్పుడు గేర్‌మార్చి మాటల తూటాలు పేలుస్తున్నారు. ఎందుకలా? ధర్మాన ప్రసాదరావు కామెంట్స్‌తో అలజడి..!ధర్మాన ప్రసాదరావు. ఆయన మాట్లాడితే ఒక పదం ఎక్కువ తక్కువ ఉండదు. సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తారు. సిక్కోలు జిల్లాలో కీలకనేతగా గుర్తింపు పొందిన ప్రసాదరావు.. చాన్నాళ్లు మంత్రిగా ఉన్నారు. వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యాక మరోసారి కేబినెట్లో చోటు దక్కుతుందని ఆశించినా..…
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ మండిపడ్డారు. బిసీలకు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అయితే..ఆయన్ను పదవీవీచ్చుతుణ్ని చేసిన సందర్భంలో, మరణించినప్పుడు మీరు ప్రవర్తించిన తీరు బీసీల మనోభావాలను దెబ్బతీసాయన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల ద్రోహి. బీసీలంటే టీడీపీలో యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు మాత్రమే అన్నారు. అధికారంలో ఉండగా బీసీలను చంద్రబాబు పట్టించుకోలేదు. మత్స్యకారులను..నాయి బ్రహ్మణులను తోలు వలుస్తా..తోకలు కత్తిరిస్తా అంటూ చాలా చులనగా చేసి మాట్లాడారు. బీసీలు మా వెనుకున్నారని చంద్రబాబు…
ఎన్నికలు ఏం లేకపోయినా కేవలం ప్రజలు ఎలా వున్నారు, వారి సమస్యలను తెలుసుకోవడానికే పల్లెబాట చేపట్టాం అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అర్హులందరికీ పధకాలు అందుతున్నాయో లేదా అని అడిగి తెలుసుకుంటున్నాం. కేవలం ఇల్లు, పెన్షన్ లాంటి చిన్న చిన్న సమస్యలు మాత్రమే ప్రజలు తీసుకొస్తున్నారు. అర్హులకు 100 శాతం పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నాం అన్నారు. ఎలాంటి అవసరం వచ్చినా సచివాలయ వ్యవస్థ అందుబాటులో ఉంది. గతంలోలా కాకుండా…
ఏపీలో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికే ఊ అంటున్నాయా? మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అంటున్న ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై వత్తిడి పెంచడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేశాయా? అంటే అవుననే అనిపిస్తోంది. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ వైఖరి ఉద్యోగ సంఘాలకు మంట పుట్టిస్తోంది. దీంతో తమ డిమాండ్ల సాధనకు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశాయి ఉద్యోగ సంఘాలు. జనవరి 9 నుంచి ఆందోళన బాట చేపట్టాలని భావిస్తున్నాయి. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం కేవలం సారాంశాన్ని మాత్రమే ఇచ్చారని, సీఎస్…
ఏపీలో ఉద్యోగ సంఘాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పీఆర్సీ పీటముడి వీడక పోవడంతో ఏంచేయాలో తెలీని పరిస్థితి ఏర్పడింది. వేర్వేరుగా సమావేశం అయిన ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణపై మల్లగుల్లాలు పడుతున్నారు. వేర్వేరు సమావేశాల అనంతరం సంయుక్తంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ పై కసరత్తు చేయనున్నాయి రెండు జేఏసీలు. గత నెలలో ఎక్కడ ఉద్యమాన్ని వాయిదా వేశారో అక్కడి నుంచే కార్యాచరణ ప్రారంభించనున్నాయి ఉద్యోగ సంఘాలు. నిరసన కార్యక్రమాలు వెంటనే…
నూతన సంవత్సర వేడుకలకు అంతా సిద్ధమవుతున్న సమయంలో.. మంద్య షాపులు, బార్లకు కాస్త వెలసుబాటు కల్పిస్తూ.. మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మద్యం విక్రయాల సమయం గంట సేపు పొడిగించింది.. రాష్ట్రంలోని బార్లు, రీటైల్ మద్యం దుకాణాలు, ఇన్ హౌస్సులో మద్యం విక్రయాల సమయంలో వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది… డిసెంబర్ 31 అర్ధరాత్రిలో మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.. ఈవెంట్స్ తో పాటు పర్యాటక లైసెన్సులు కలిగిన హోటళ్లల్లో…
బీజేపీ సభపై మండిపడ్డారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ సబ టీడీపీ అనుబంధ విభాగం సభలా బీజేపీ సభ జరిగింది. రాష్ట్రంలో బీజేపీ లేదు.. అందుకే ప్రజల భావోద్వేగాలు ఏంటో వాళ్ళకు తెలియదు. రాష్ట్రంలో బీజేపీ శక్తి ఏంటో వాళ్ళకూ తెలుసు. చంద్రబాబు డైరెక్షన్ తోనే బీజేపీ సభ జరిగిందన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు ఒక మాయా ఫకీరు. దేశ చరిత్రలో మొదటి సారి ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ నేతృత్వంలో పని చేయటంచంద్రబాబు గంట…