ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి ఏటా ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఓసారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులను ఏపీ సర్కార్ జమ చేస్తోంది. అయితే జూలై- సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన డబ్బులను నవంబర్ 28 లేదా 29 న ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తుందని ప్రచారం జరిగినా.. కర్నూలు జిల్లా పాణ్యం పర్యటనలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధుల విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ప్రభుత్వ వర్గాల నుంచి తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ నెల 7వ తారీఖున జగనన్న విద్యా దీవెన డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కర్నూలు పర్యటనలోనే జగనన్న విద్యా దీవెన డబ్బులను సీఎం జగన్ రిలీజ్ చేయనున్నారు.
Read Also: Shane Dowrich: వెస్టిండీస్ కీపర్ అనూహ్య నిర్ణయం.. జట్టులోకి ఎంపిక చేశాక..!
అయితే, జగనన్న విద్యా దీవెన మూడో విడత సాయాన్ని ఆగస్టు 28న ప్రభుత్వం రిలీజ్ చేసింది. కాగా, డిసెంబర్ 7న నాలుగో విడత సాయం రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలో ఉన్నత విద్య కోర్సులు చదువుకునే విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, ఇతర కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఈ డబ్బులను వారి తల్లుల ఖాతాల్లో జగన్ సర్కార్ జమ చేస్తోంది.
Read Also: Anantapur: వామ్మో.. వీళ్ళు లేడీలు కాదు కేడీలు.. పెళ్ళి షాపింగ్ అని లక్షల విలువైన చీరలతో పరార్
ఇక, ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రభుత్వం డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తోంది. అయితే గత నెలలో విద్యార్థులు, తల్లుల పేరుతో ఉండే ఉమ్మడి బ్యాంకు ఖాతాల్లోనే ఈ డబ్బులను జమ చేయనున్నట్లు పేర్కొనింది. జాయింట్ అకౌంట్ లేని వారు కొత్తగా ఓపెన్ చేయాలని వెల్లడించింది. జాయింట్ అకౌంట్ లేకపోతే డబ్బులు పడవని క్లీయర్ గా చెప్పింది. అయితే ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మాత్రం ఉమ్మడి ఖాతా నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఇంజినీరింగ్ లేదా డిగ్రీ చదివే విద్యార్థులకు ఏటా రూ. 20 వేలు, పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు రూ. 15 వేలు, ఐటీఐ చదివే విద్యార్థులకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తోంది.