Diwali 2023 : దీపావళి సెలవులో కీలక మార్పు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాలెండర్‌లో గానీ, ప్రభుత్వం జారీ చేసిన పండగ సెలవుల జాబితాలో గానీ దీపావళి నవంబర్ 12వ తేదీ అని ఉంది. 12వ తేదీన ఉన్న సెలవును 13వ తేదీన సాధారణ సెలవుగా పేర్కొంటూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం దీపావళి సెలవును నవంబర్ 13వ తేదీకి మార్చింది. ఇంతకుముందు నవంబరు 13వ తేదీ ఆప్షనల్ హాలిడేగా ఉండగా, ఇప్పుడు దాన్ని ఏపీ ప్రభుత్వం సాధారణ సెలవుగా మార్పు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read: Congress Third List: కాంగ్రెస్ మూడో జాబితా విడుదల.. కామారెడ్డి బరిలో రేవంత్
ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన లీవ్స్ లిస్టులో నవంబర్ 12వ తేదీన ఆదివారం దీపావళిగా, అదే రోజు సెలువుగా ఉంది. కానీ ఆదివారం ఎలాగూ గవర్నమెంట్ హలీడే కాబట్టి సెలవులో మార్పు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ నోటిఫికేషన్ జారీ చేశారు.