ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి జిరాక్స్ రిజిస్ట్రేషన్ల విధానం అమల్లోకి రానుంది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలో ఈ విధానాన్ని స్టార్ట్ చేయగా.. నేటి నుంచి రాష్ట్రం మొత్తం అమలు చేయనున్నారు. అయితే ఈ కొత్త విధానంలో రిజిస్ట్రేషన్లు మందకొడిగా కొనసాగుతున్నాయని.. పలుసార్లు సాంకేతిక సమస్యలు వస్తున్నాయని అధికారులు రిజిస్ట్రేషన్ల అధికారులు వెల్లడిస్తున్నారు.
Read Also: Anushka Shetty Birthday: బర్త్‌డే గిఫ్ట్‌గా.. ఆ బ్లాక్ బస్టర్ మూవీ పార్ట్-2 ప్రకటన రానుందా?
ఇక, విశాఖపట్నంలో ఉన్న 9 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కలిపి గతంలో ప్రతి రోజు 200 రిజిస్ట్రేషన్లు జరుగుతుండేవి.. కానీ, గత వారం క్రింద స్టార్ట్ చేసిన జిరాక్స్ రిజిస్ట్రేషన్ల విధానంలో 9 ఆఫీసుల్లో కలిపి రోజుకి 20 కూడా కావడం లేదని తెలిపారు. అలాగే, విజయవాడలోని మూడు కార్యాలయాల్లోనూ జరిగే రిజిస్ట్రేషన్లు వేళ్లపై లెక్కించవచ్చు అని అక్కడి అధికారులు అంటున్నారు. అయితే, ఇక్కడ ఈ విధానాన్ని దాదాపు నెలన్నర నుంచి కొనసాగిస్తున్న అందులో పెద్దగా మార్పులు కనిపించడం లేదని వాపోతున్నారు. దీని వల్ల ఎదురౌతున్న సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికి ప్రభుత్వం వాటిని పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తుంది.