ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలు వెబ్సైట్లో ఎందుకు అప్లోడ్ చేయడం లేదని కోర్టు ప్రశ్నించింది. జీవోల్లో ఐదు శాతమే సైట్లో ఉంచుతున్నారని న్యాయవాది బాలాజీ తెలిపారు. కాగా ఇది సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకమని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే కొన్ని రహస్య జీవోలే అప్లోడ్ చేయడం లేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా అన్ని జీవోల వివరాలను వెంటనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం కరవు భత్యాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన కరువు భత్యాన్ని 2022 జనవరి నెల జీతంతో కలిపి విడుదల చేసేందుకు గానూ ప్రభుత్వం ఆమోదం తెలియచేసింది. జనవరి జీతంతో కలిపి మూడు విడతలుగా పెరిగిన కరవు భత్యం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. డీఏలో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాలకు మిగతా 90 శాతం మొత్తాన్ని నేరుగా…
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర హైకోర్టు.. ఈ కేసులో సింగిల్ బెంచ్ తీర్పును ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసిన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ మరోసారి ఈ కేసులో విచారణ చేపట్టింది ధర్మాసనం.. ఇక, టికెట్ల ధరల నియంత్రణపై జీవో నంబర్ 35 రద్దు అందరికీ వర్తిస్తుందన్నారు అడిషనల్ జనరల్.. కాగా, గత విచారణలో పిటిషనర్లకే జీవో నుంచి మినహాయింపు వస్తుందని హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ…
కోవిడ్‌తో అనాధలైన కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం కృష చేస్తుంది. ఇప్పటికే వారికి సాయం ప్రకటించింది. అయితే ఆ సాయం నేరుగా వారికే చేరేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియను ఇక ఆన్లైన్ చేసేందుకు కోవిడ్ 19 పోర్టల్‌ను తీసుకొచ్చింది. కరోనా వైరస్ (కోవిడ్ – 19) కారణంగా మరణించిన వారి వారసులకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించడానికి ఆన్లైన్ పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ముఖ్య కార్యదర్శి…
సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జి.వో. 35ను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జ్ తో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జీవో 35 సస్పెండ్ అయిందనే సంతోషంలో ఉన్న వారికి ప్రభుత్వం నిర్ణయం ఓ విధంగా షాక్ అనే చెప్పాలి. ఇక దీనిపై హైకోర్టులో సోమవారం వాదనలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం విడుదలైన ‘పుష్ప’పై ఈ ఎఫెక్ట్ బాగానే పడింది. అంతకు ముందు…
రైతులను వదిలేసే ప్రభుత్వం తమది కాదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. శుక్రవారం గుంటూరులోని ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటిలోని అగ్రిటెక్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ క్రాప్ ద్వారా నల్లతామర పురుగుతో దెబ్బతిన్న మిర్చిపంటపై నివేదిక తెప్పిస్తామన్నారు. Read Also: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై ఎన్జీటీ కీలక తీర్పు వ్యవసాయ, ఉద్యానశాఖ వీసీలతో పాటు సైంటిస్టులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నల్ల…
అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టొద్దని జాతీయ హరిత ట్రిబ్యూనల్ (NGT) తీర్పునిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి నిపుణులతో కమిటీ వేయాలని ప్రతిపాదించింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టొద్దని సూచించింది. Also Read: ఏపీని చంద్రబాబు అభివృద్ధి చేస్తే జగన్ నాశనం చేస్తున్నాడు: నిమ్మల రామనాయుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం పై అధ్యయనానికి నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీ వేయాలని, ఈ కమిటీ నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని…
ఏపీలో టిక్కెట్ల రేట్ల వ్యవహారం, బెనిఫిట్ షోలను రద్దు చేయడం వంటి అంశాలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. పెద్ద హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు ప్రదర్శించడం ఎన్నాళ్ల నుంచో ఆనవాయితీగా వస్తున్న వ్యవహారం. అయితే ప్రస్తుతం ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు చేయడంపై పలు హీరోల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది కొత్తగా సినిమాలపై ఆంక్షలు విధించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Read Also: రివ్యూ: పుష్ప ఏపీ ప్రభుత్వం తాజాగా…
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇచ్చిన జీవోను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేయడంతో.. ఇది మరింత చర్చకు దారితీసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను సంప్రదించిన సంగతి తెలిసిందే కాగా… ఇవాళ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. సినిమా టికెట్ల ధరలపై ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు.. గతంలో ఉన్న కమిటీలో లోటు పాట్లను సరి చేసి…
గత కొన్ని రోజులుగా ఏపీలో టికెట్ల రేట్లపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపుపై లేదంటూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీరును సవాల్ చేస్తూ హైకోర్టు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ల రేట్లను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో రద్దు చేస్తున్నట్లు తీర్పునిచ్చింది. పాత రేట్లు వర్తిస్తాయని హైకోర్టు వెల్లడించింది. ఈ…