ఆంధ్రప్రదేశ్‌లో కేబినేట్ విస్తరణకు ఇంకా అవకాశం ఉందా లేదా అన్న అనుమానాలు రేకేత్తుతున్నాయి.కాగా ఇప్పట్లో ఏపీ క్యాబినేట్ విస్తరణ ఉండకపోవచ్చనే సమాధానం మాత్రం వస్తుంది. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో విస్తరించాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని గతంలో జగన్ చెప్పినా మరికొన్నాళ్లు వేచి చూసే అవకాశం లేకపోలేదు. అటు విస్తరణలో అందర్ని మారిస్తే వారు శాఖలపై పట్టు సాధించేలోపు ఎన్నికలు వస్తాయని జగన్ ఆలోచిస్తున్నారు. 7-8 మందితో…
రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి నిరోధానికి మరోమారు మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. కేంద్ర హోమ్ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని వారికి రూ. 100 జరిమాన విధింపునకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మాస్కు లేని వారిని దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే సదరు యాజమాన్యానికి రూ. 10 వేల నుంచి రూ. 25…
కరోనా వైరస్‌తో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఒమిక్రాన్ వేరింయట్‌తో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో కరోనా వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించే జీనోమ్ స్వీక్వెన్సింగ్ ల్యాబ్ ఏపీలో లేకపోవడంతో ఫలితాల నిర్ధారణ కోసం హైద్రాబాద్‌కు పంపాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వచ్చే వారంలో రాష్ర్టంలోనే ఈల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ)తో రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ ఒప్పందం చేసుకుంది. విజయవాడలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ…
ఆంధ్రప్రదేశ్‌లోని జీవోనెం.29కు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. వార్డు, మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమిస్తు రాష్ర్ట ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెల్సిందే. అయితే జీవో నెం.59ను ఉపసంహరించుకుంటున్నామని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. డ్రెస్ కోడ్‌ను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. వారిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. దీంతో విచారణణు మరో వారానికి వాయిదా వేసింది. ఇప్పటికే…
ఏపీ ఎన్జీఓ హోమ్ లో జరిగిన మీడియా సమావేశంలో బండి శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రభుత్వం మీదా అనేక రకాలుగా ఒత్తిడిని తీసుకువస్తు 71 డిమాండ్లు తీసుకువచ్చాము. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో సి.పి.ఎస్ రద్దు చేసి ఓ.పి.ఎస్ తీసుకువస్తాను అని చెప్పారు . అది ఈరోజుకు అమల్లోకి రాలేదు. 55 శాతం ఫిట్మెంట్ తో పి.ఆర్.సి ఇవ్వాల్సి ఉంది. సజ్జల రామకృష్ణ గారు వచ్చి నెలాఖరుకు అమలు చేస్తాం అని చెప్పారు. దయచేసి మాకు పి.ఆర్.సి నివేదిక…
పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలో ఉద్యోగ సంఘాల జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. మొత్తం 71 డిమాండ్లతో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. కర్నూలు, ఏలూరు, పాడేరు తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. కర్నూలులో ఉద్యోగ సంఘాలు నిర్వహించిన ఆందోళనల్లో ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. Read…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రైవేట్ లేఔట్ల నిర్మాణాల్లో 5 శాతం భూమిని ఇవ్వాలంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ భూమిని సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం.. కొత్తగా నిర్మించే లేఔట్లో భూమిని ఇవ్వలేకుంటే.. దానికి మూడు కిలోమీటర్ల పరిధిలో భూమిని కొని ఇవ్వాలని నిబంధన విధించింది. లేని పక్షంలో ఆ భూమి విలువ మేర.. డబ్బులు కూడా చెల్లించే ఆప్షన్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇక,…
ఏపీలోని జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై ఈనెల 7 నుంచి ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ, ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులయిన గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు పదార్థాలు అన్నింటిపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. వీటిని ఏ పేరుతోనైనా తయారు చేయడం అమ్మడం, సరఫరా చేయడం, నిల్వ…
పీఆర్సీ విషయంలో తమ డిమాండ్లు నెరవేర్చాని కోరుతూ మంగళవారం నుంచి ఏపీలో ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. అయితే ఉద్యోగ సంఘాలు చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయించుకుంది. ఈ మేరకు తాము సమ్మెలో పాల్గొనడం లేదని ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రవికుమార్ ప్రకటించారు.. రేపటి నుంచి ఉమ్మడి జేఏసీ తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం పాల్గొనటం లేదని స్పష్టం చేశారు. పది…
తెలంగాణ అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో.. దాదాపు ఆర్టీసీ బస్సులన్నీ ఒకే కలర్ లో ఉంటాయి. ఆ రంగులను బస్సు పేర్లను ఇప్పటికి రెండు రాష్ర్టాల ఆర్టీసీ సంస్థ ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టలేదు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి కాలంలో… గ్రామాల్లో నడిచే బస్సులకు పల్లెవెలుగు అని పేరు పెట్టారు. ఆ పేరుతోనే… ఇప్పటికీ ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. అప్పటి నుంచి ఆ బస్సుల కలర్‌ను గానీ పేరును గానీ మార్చలేదు. ఏ ప్రభుత్వాలు.. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని…