సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా ఏపీ టికెట్ రేట్లపై ఇష్యూ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ఈ వివాదంపై సైలెంట్ గా ఉన్న మోహన్ బాబు టికెట్ల ధరలపై రేపు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు తెలుస్తోంది. సినిమా టికెట్ల ధరలపై తొలిసారి మోహన్‌బాబు స్పందించబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Also : టాలీవుడ్ లో సంక్రాంతి సంబరం… పోటీకి సై అంటున్న చిన్న సినిమాలు !!
మరోవైపు అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్షత్రియ సేవా సమితి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో ‘అల్లూరి’ని సజీవంగా కళ్ళముందు నిలిపిన సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబుతో పాటు పలువురు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ రెండు సార్లు ఎమ్మెల్యే గా పని చేసిన అవంతి శ్రీనివాస్ అల్లూరి ఊరి కి ఏమి చేశారో చెప్పాలి అన్నారు నవ్వుతూ. అల్లూరు ఊరికి నేను వచ్చి చూస్తాను. అవంతి శ్రీనివాస్ ఏమి చేశాడో చూస్తాను ? సహాయం కావాలంటే చేసే వ్యక్తి కిషన్ రెడ్డి. కరోనా టైములో మా ఫ్యామిలీ మెంబెర్స్ సింగపూర్ లో ఉండి పోతే ఆయన సహాయం చేశారు. సౌత్ ఇండియా అంటే ఏంటి ? నార్త్ ఇండియా అంటే ఏంటి? ఇంతకు ముందు పరిస్థితులు వేరు… ఇప్పటి ప్రధాని అన్ని చేస్తారు. రాజకీయ రాజుల నవ నాడులలో ఉంటుందీ. వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. కృష్ణ హీరోగా ఉన్న సినిమాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. రూ. 350 జీతం నెలకు… ఆయనకు డైలాగ్ చెప్పడానికి మళ్ళీ మళ్ళీ వెళ్ళేవాడిని అలాగైనా ఆయనతో కలిసి ఫోటో దిగొచ్చని అనుకునేవాడిని. ఆయనకు భేషజాలు లేవు” అంటూ కృష్ణపై అభిమానాన్ని వ్యక్తం చేశారు.