ఏపీ ఎన్జీఓ హోమ్ లో జరిగిన మీడియా సమావేశంలో బండి శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రభుత్వం మీదా అనేక రకాలుగా ఒత్తిడిని తీసుకువస్తు 71 డిమాండ్లు తీసుకువచ్చాము. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో సి.పి.ఎస్ రద్దు చేసి ఓ.పి.ఎస్ తీసుకువస్తాను అని చెప్పారు . అది ఈరోజుకు అమల్లోకి రాలేదు. 55 శాతం ఫిట్మెంట్ తో పి.ఆర్.సి ఇవ్వాల్సి ఉంది. సజ్జల రామకృష్ణ గారు వచ్చి నెలాఖరుకు అమలు చేస్తాం అని చెప్పారు. దయచేసి మాకు పి.ఆర్.సి నివేదిక…
పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలో ఉద్యోగ సంఘాల జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. మొత్తం 71 డిమాండ్లతో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. కర్నూలు, ఏలూరు, పాడేరు తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. కర్నూలులో ఉద్యోగ సంఘాలు నిర్వహించిన ఆందోళనల్లో ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. Read…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రైవేట్ లేఔట్ల నిర్మాణాల్లో 5 శాతం భూమిని ఇవ్వాలంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ భూమిని సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం.. కొత్తగా నిర్మించే లేఔట్లో భూమిని ఇవ్వలేకుంటే.. దానికి మూడు కిలోమీటర్ల పరిధిలో భూమిని కొని ఇవ్వాలని నిబంధన విధించింది. లేని పక్షంలో ఆ భూమి విలువ మేర.. డబ్బులు కూడా చెల్లించే ఆప్షన్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇక,…
ఏపీలోని జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై ఈనెల 7 నుంచి ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ, ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులయిన గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు పదార్థాలు అన్నింటిపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. వీటిని ఏ పేరుతోనైనా తయారు చేయడం అమ్మడం, సరఫరా చేయడం, నిల్వ…
పీఆర్సీ విషయంలో తమ డిమాండ్లు నెరవేర్చాని కోరుతూ మంగళవారం నుంచి ఏపీలో ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. అయితే ఉద్యోగ సంఘాలు చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయించుకుంది. ఈ మేరకు తాము సమ్మెలో పాల్గొనడం లేదని ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రవికుమార్ ప్రకటించారు.. రేపటి నుంచి ఉమ్మడి జేఏసీ తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం పాల్గొనటం లేదని స్పష్టం చేశారు. పది…
తెలంగాణ అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో.. దాదాపు ఆర్టీసీ బస్సులన్నీ ఒకే కలర్ లో ఉంటాయి. ఆ రంగులను బస్సు పేర్లను ఇప్పటికి రెండు రాష్ర్టాల ఆర్టీసీ సంస్థ ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టలేదు. వైయస్ రాజశేఖర్రెడ్డి కాలంలో… గ్రామాల్లో నడిచే బస్సులకు పల్లెవెలుగు అని పేరు పెట్టారు. ఆ పేరుతోనే… ఇప్పటికీ ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. అప్పటి నుంచి ఆ బస్సుల కలర్ను గానీ పేరును గానీ మార్చలేదు. ఏ ప్రభుత్వాలు.. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లోని…
ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి, ఉద్యోగులకు పీఆర్సీ ఇతర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే.. తాజగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఏపీ ఎన్జీవో రాష్ర్ట అధ్యక్షుడు బండి శ్రీనివాసులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల ఉద్యమానికి ఎవరైనా తలవంచాల్సిందేనని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా, కూల్చాలన్నా తమ చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. రాష్ర్ట వ్యాప్తంగా 13లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, ఒక్కో ఇంట్లో 5 ఓట్లు ఉంటాయని…
మరపురాని మధురగాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు శతజయంతి డిసెంబర్ 4న మొదలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ‘ఘంటసాల శతజయంతి ఉత్సవాలను’ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడానికి సంకల్పించారు. ఈ విషయం తమకెంతో ఆనందం కలిగిస్తోందని ఘంటసాల సతీమణి సావిత్రమ్మ అన్నారు. ఘంటసాల శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోన్న ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సావిత్రమ్మ. ఆమె అనారోగ్య కారణంగా ఓ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలుపగా, ఆమె సందేశాన్ని ఘంటసాల రెండవ కూతురు సుగుణ చదివి వీడియో ద్వారా పోస్ట్…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్ 24వ తేదీ కిమ్స్ హాస్పిటల్ లో చేరిన ‘సిరివెన్నెల’ సీతా రామశాస్త్రి నవంబర్ 30వ తేదీ మధ్యాహ్నం కన్నుమూశారు. అయితే ఈ సమయంలో హాస్పిటల్ లో వైద్యానికి అయిన ఖర్చులన్నంటినీ ఏపీ ప్రభుత్వం భరిస్తుందని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. దానికి కృతజ్ఞతగా సిరివెన్నెల కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ…
ఏపీ సీఎం జగన్పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ కాన్వాయ్ను తమ సమస్యల పరిష్కారం కోసం అడ్డుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేయడాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ఎందుకంటూ ఏపీ సర్కారుపై లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. సమస్యలపై…