ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించడమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది కూటమి సర్కార్.. ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం..
ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసెంబ్లీ సమావేశాలకు వస్తామన్న మా డిమాండ్ కు కూటమి ప్రభుత్వం తోక ముడుస్తుందని విమర్శించారు శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం..
బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఫోకస్ పెట్టింది. దసరా మహోత్సవాల ప్రణాళికలు, భక్తుల రద్దీ నిర్వహణ, క్యూ లైన్లు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, త్రాగునీరు, వైద్య సహాయం, శానిటేషన్ వంటి అంశాలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షించారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు భద్రత కల్పించింది ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యేకు (1+1) గన్మెన్లను కేటాయించింది ప్రభుత్వం.. తనకు భద్రత కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు వర్మ.. దీంతో, ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 నెలలు గడిచిన సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? అంటూ బొత్స మండిపడ్డారు. దమ్ములు గురించి మాట్లాడటానికి ఇవి మల్ల యుద్ధాలు కాదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి..అసెంబ్లీ లో తేల్చుకుంటామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 నెలల్లో రెండు లక్షలు…
రైతులకు కూలి ఖర్చులు కూడా రావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. వేంపల్లి మండలం తాళ్లపల్లిలో ఉల్లి పంటను పరిశీలించారు.. అయితే ఉల్లి పంటికి గిట్టుబాటు ధర లభించడంలేదంటూ మాజీ సీఎంకు మొరపెట్టుకున్నారు రైతులు.. దళారులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో రూ.4 వేల నుంచి రూ.12 వేల వరకు మద్దతు…
ఆంధ్రప్రదేశ్ లో కొత్త బార్ల ఏర్పాటుకు స్పందన పెద్దగా రాలేదు... 840 బార్లకు కేవలం 466 మాత్రమే దరఖాస్తులు పెట్టుకున్నారు.. ఓపెన్ కేటగిరీలో 388 కల్లు గీత కార్మికులకు ఇచ్చిన రిజర్వ్డ్ లో 78 బార్లు డ్రాలో కేటాయించారు.. మిగిలిన వాటికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..
ఐపీఎస్ అధికారి, ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ కు మరోసారి షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అతడిపై సస్పెన్షన్ను మరోసారి పొడిగించింది.. మరో 6 నెలల పాటు సస్పెన్షన్ వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..