Andhra Pradesh: ఒకేసారి 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీనిపై సుదీర్ఘ కసరత్తు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పాలనలో మార్పులు. మరింత చురుగ్గా పాలన కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.. వచ్చే మూడేళ్ల పాటు మంచి టీమ్ ఉండాలనే ఆలోచనలో ఉన్న చంద్రబాబు. అందుకు అనుగుణంగా ఇప్పటకిఏ సీనియర్ అధికారులను బదిలీ చేశారు.. ఇప్పుడు.. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు..
Read Also: RBI: ఈఎంఐలో ఫోన్ తీసుకుంటున్నారా..? భారీ షాక్ ఇవ్వనున్న ఆర్బీఐ..!
12 జిల్లాల కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి.. విజయనగరం కలెక్టర్‌గా రామసుందర్‌రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా కీర్తి చేకూరు.. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా, పల్నాడు జిల్లా కలెక్టర్‌గా కృతిక శుక్లా, బాపట్ల జిల్లా కలెక్టర్‌గా వినోద్‌కుమార్, ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజాబాబు, నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా, అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా నిషాంత్‌కుమార్, కర్నూలు జిల్లా కలెక్టర్‌గా సిరి, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఆనంద్, సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా శ్యాంప్రసాద్‌ను నియమించింది ప్రభుత్వం.. ఇక, కొత్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కీలక సూచనలు చేశారు..