IAS Transfers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సచివాలయంలో ఉన్న ఉన్నతాధికారుల నుంచే ఈ బదిలీలు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. కాగా, ఈ ట్రాన్స్‌ఫర్స్ కి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే, ఇటీవల కొంతమంది అధికారుల పని తీరు.. వస్తున్న ఇబ్బందులు వంటివి దృష్టిలో పెట్టుకుని మార్పులు చేయనున్నట్లు టాక్.
Read Also: Lunar Eclipse: గ్రహణం సమయంలోనూ ఈ ఆలయాలు తెరిచే ఉంటాయ్.. ఎందుకంటే..?
అయితే, సీఆర్డీఏ అధికారులను సైతం బదిలీ చేసే అవకాశం ఉంది అని సమాచారం. ముందుగా కార్యదర్శి స్థాయి అధికారులను బదిలీలు చేసి.. ఆ తర్వాత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ట్రాన్స్‌ఫర్ చేసే యోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా, వర్షకాల అసెంబ్లీ సమావేశాల్లోపు బదిలీల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.