పాస్టిక్ నిషేధంపై కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ సచివాలయంలో ఈనెల 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నాం అన్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్. వచ్చే ఏడాది జూన్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించడమే ప్రభుత్వం లక్ష్యం అన్నారు.
అదానీ గ్రూప్కు కేటాయింపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం.. అదానీ గ్రూప్ కు ఇచ్చిన పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఆంధ్రా - ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో అదాని గ్రూప్నకు పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు ఇచ్చింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. అయితే, గిరిజనులకు దక్కాల్సిన ప్లాంట్లు అదానీ గ్రూప్ కు ఇవ్వడంతో వెనక్కు తీసుకుంది కూటమి సర్కార్..
ఈ సారి అమరావతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ సచివాలయం వెనక ప్రాంతంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనుంది కూటమి సర్కార్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లుగా ఇతర శాఖల ఉద్యోగుల నియామకంపై విధివిధానాలు జారీ చేసింది... ఇతర శాఖల నుంచి ఎక్కువ మంది మున్సిపల్ శాఖకు వచ్చేందుకు ఆసక్తి చూపుతుండటంతో పలు నిబంధనలతో ఉత్తర్వులు జారీ చేసింది..
ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్.. అఖిల భారత సర్వీసుల అధికారులకు నేషనల్ పెన్షన్ పథకం (NPS)కింద ఇచ్చే వాటా పెంచింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. ఏఐఎస్ అధికారులకు ప్రభుత్వం ఇచ్చే వాటాను 10 శాతం నుండి 14 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.
రామాయపట్నం పోర్టుపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం.. రామాయపట్నం పోర్టు కనెక్టివిటీ పెంపు ప్రతిపాదనపై దృష్టిసారించింది.. పరిశీలనకు ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది.. ఆర్థిక, ఐ అండ్ ఐ, టూరిజం శాఖల మంత్రులతో ఉప సంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది..
ఏపీ ప్రతిపాదిత “బనకచర్ల ప్రాజెక్ట్” వివాదంపై రేపు అత్యున్నత స్థాయి సమావేశం జరుగనున్నది. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ నేతృత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి ఢిల్లీ కి చేరుకోనున్న ఏపి ముఖ్యమంత్రి.. రేపు ఉదయం ఢిల్లీకి రానున్న తెలంగాణ ముఖ్యమంత్రి.. తెలంగాణ వ్యతిరేకత, కేంద్ర అభ్యంతరాల నేపథ్యంలో చర్చ జరుగనుంది. అత్యున్నత స్థాయి (అపెక్స్ కమిటీ) సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.…
Electricity Bill Shock: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలం, మామిడికుదురు గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ నన్నేషా హుస్సేన్ ఇంటికి రూ. 15,14,993 కరెంట్ బిల్లు వచ్చి తీవ్ర ఆందోళనకు గురయ్యారు.