Harsha Kumar: మెడికల్ కాలేజీల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌లో పాలక, ప్రతిపక్షాల మధ్య.. ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం కాగా.. అవి ప్రైవేట్‌పరం చేయొద్దు అంటూ.. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.. అయితే, వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం తగదని అంటున్నారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్.. వైద్య కళాశాలలను ప్రభుత్వం నడపటానికి ఇబ్బంది ఏమిటి..? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పరిస్థితులు ఏమీ బాగోలేదు, మెడికల్ సీట్లు 150 ఉంటే 100 సీట్లు అమ్ముకుని, 50 సీట్లు రిజర్వేషన్లకు ఇస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పెట్టే సభలలో వారి డప్పు వాళ్లే కొట్టుకుంటున్నారని.. చేసేది తక్కువ బడాయి ఎక్కువ అన్నట్టుంది ఈ ప్రభుత్వం పనితీరు ఉందంటూ విమర్శలు గుప్పించారు.
Read Also: భారత్ అత్యంత సంపన్న పార్టీగా బీఆర్‌ఎస్ నాలుగో స్థానంలో టీడీపీ
ఇక, ఉచిత ఇసుక పేదలకు అందడం లేదని, కొంత మంది ఎమ్మేల్యేలు, మంత్రులకు ఉచిత ఇసుక వ్యాపారంగా మారిందని ఆరోపించారు హర్షకుమార్. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్.. చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం అందలేదని, 15 నెలల పాలనలో ఒక్క కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం అందజేయలేకపోయారని విమర్శించారు.. నారా లోకేష్ గెలవడానికి మంగళగిరిలో చేనేత కార్మికులు ఎక్కువ కావడంవల్ల, చేనేత కుటుంబానికి సంవత్సరానికి 20,000 ఇస్తా అన్నాడు.. కానీ, గెలిచిన తర్వాత చేనేత కుటుంబాలకు అన్యాయం చేశారని విమర్శించారు. వేట విరామ సమయంలో గత సంవత్సర కాలంగా మత్స్యకారుడికి ఆర్థిక సాయం అందిస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు.. డ్వాక్రా సంఘాలకు రుణాలు ఊసే లేదని మండిపడ్డారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్..