నాలుగో విడత యాత్ర ఇవాళ్టి నుంచి అవనిగడ్డ వేదికగా ప్రారంభం అవుతుంది అని నాదేండ్ల మనోహర్ అన్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి కూడా ప్రజలు, అభిమానులు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
రేపు(సోమవారం) మూడో రోజు ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రైతు రుణాలు, 9,10వ షెడ్యూల్లో ఆస్తులు, తూర్పు కాపులకు బీసీ ధృవ పత్రం, చంద్రన్న బీమా పథకం, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు, ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్లు, విద్యా దీవెన, వసతి దీవెన అంశాలపై ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నారు.
సీఎం వైఎస్ జగన్ 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న విషయం వైసీపీ నాయకులు గుర్తించాలి అని రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తెలిపారు. నార్త్ కొరియా నియంత కిమ్ కంటే జగన్మోహన్ రెడ్డి ప్రమాదకరంగా తయారయ్యాడు..