Face Recognition System: ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల్లో అటెండెన్స్ సరిగా లేదంటూ సీరియస్ అవుతుంది ప్రభుత్వం.. దీనికి 100 శాతం అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలంటూ.. అన్ని శాఖల సెక్రటరీలు.. హెచ్‌వోడీలు, జిల్లా కలెక్టర్లకు మెమోలు జారీ చేసింది జీఏడీ.. ఫేస్ రికగ్నిషన్ విధానం (FRS) ద్వారా పూర్తి స్థాయిలో ఉద్యోగుల అటెండెన్స్ వేయడం లేదంటూ సీరియస్ అయిన ప్రభుత్వం.. ఫేస్ రికగ్నిషన్ యాప్ ను 100 శాతం ఎన్రోల్ చేసుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇప్పటికీ కేవలం 45-50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే FRS ద్వారా అటెండెన్స్ వేస్తున్నారని జీఏడీ గుర్తించింది.. చాలా మంది ఉద్యోగులు ఉదయం FRS ద్వారా చెక్ ఇన్ అవుతున్నారు.. కానీ, చెక్ అవుట్ కాకపోవడంపై జీఏడీ అభ్యంతరం వ్యక్తం చేసింది..
Read Also: Stock Market Opening: కోలుకున్న స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 330 పాయింట్లు, నిఫ్టీలో కూడా పెరుగుదల
ఇక, ఉద్యోగుల సెలవులను FRS విధానం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉన్నా.. దానిని చాలా మంది ఫాలో కావడం లేదంటున్నారు జీఏడీ అధికారులు.. ఇంఛార్జ్‌ల పర్యవేక్షణలో లోపం వల్లే FRS అమలు సరిగా లేదనే అభిప్రాయానికి వచ్చింది.. FRS సరిగా అమలయ్యేలా ఇంఛార్జ్‌లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని శాఖల సెక్రటరీలు, హెచ్‌వోడీలు, జిల్లా కలెక్టర్లకు మెమోలు జారీ చేసింది జీఏడీ. కాగా, ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్)ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మొదటల్లో దీనిపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు ఉద్యోగులు.. అయితే, ఏ మాత్రం వెనక్కి తగ్గని ప్రభుత్వం.. అక్రమంగా అన్ని విభాగాలకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ని విస్తరించింది.. కానీ, ఇప్పటికీ అన్ని విభాగాల్లో పూర్తి స్థాయిలో ఇది అమలు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం.