Liquor Shops: ముగుస్తున్న మద్యం షాపుల గడువు.. మరో ఏడాది పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే మద్యం షాపుల గడువు ముగియనుంది.. ఈ నెలాఖరు (అక్టోబర్)తో మద్యం దుకాణాల గడువు ముగుస్తుంది.. అయితే.. షాపులకు కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. మద్యం షాపుల కాలపరిమితిని మరో ఏడాది పొడిగిస్తున్నట్టు జీవో ఎంఎస్ నెంబర్ 466ను జారీ చేశారు అబ్కారీ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ.. ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ ప్రతిపాదనల మేరకు ఈ ఏడాది కూడా గతేడాది లాగే 2,934 షాపులను కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Also: Mahalakshmi: నా భర్త నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.. నిర్మాత భార్య సంచలన ఆరోపణలు
Also Read
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
కాగా, ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ఇచ్చిన హామీ దశలవారీగా మద్యపాన నిషేధం.. కానీ, అది కార్యరూపం దాల్చలేదనే విమర్శలు గున్నాయి.. ఇదే సమయంలో.. ప్రైవేటు దుకాణాలను మూసి వేయించిన జగన్ సర్కార్.. నూతన లిక్కర్ పాలసీ తీసుకువచ్చి.. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతోంది.. అనేక రకాల నూతన బ్రాండ్ ల మద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మద్యం సామాన్యులకు దూరం చేయాలన్న ఆలోచనా..? ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలన్న తపనా..? అనే చర్చ తర్వాత విషయం.. కానీ.. ప్రభుత్వం మద్యం ధరలను అమాంతం పెంచేసింది.. బెల్టు షాపులను రద్దు చేసింది. విడతల వారీగా మద్యం దుకాణాలను, మద్యం విక్రయాలను తగ్గించడమే తమ టార్గెట్‌గా చెబుతున్నారు.. ప్రతి ఏటా 25 శాతం మధ్య దుకాణాలను ఎత్తివేసే ప్రణాళికలను రూపొందించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఈ ఏడాది కూడా గతేడాది లాగే 2,934 షాపులను కొనసిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
ట్రెండింగ్
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!