Kuppam: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం రూపురేఖలు మారిపోతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టించడానికి చకచక అడుగులు పడుతున్నాయి. ఎన్నికల అనంతరం సీఎం హోదాలో కుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. పలుకీలకమైన హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీల్లో భాగంగా తొలుత.. కడా (కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ను తిరిగి ప్రారంభించారు. కుప్పం సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 1995లోనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో డీఆర్‌డీఏ పీడీ, సబ్ కలెక్టర్ స్థాయి అధికారులను ప్రాజెక్టు అధికారులుగా కొనసాగారు. 2004 వరకు కొనసాగిన కడాను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది. చంద్రబాబు మూడో దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తర్వాత 2014లో మళ్లీ పునరుద్ధరించారు. ఐదేళ్ల పాటు ప్రాజెక్టు అధికారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేశారు.
Read Also: Anant Ambani: అంబానీ ఇంట కుక్కైనా ‘హ్యాపీ’నే.. పెళ్లిలో రాయల్ ట్రీట్మెంట్ చూశారా?
అయితే, వైసీపీ హయాంలో ఆ ప్రాజెక్టుకు అటకెక్కించారు. ఇక, ప్పం పురపాలికతో పాటు కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం మండలాల్లో ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వేగవంతంలో ‘కడా’ కీలకంగా మారనుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి వారధిగా నిలవనుంది. అభివృద్ధి ప్రణాళిక రూపకల్ప, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఆర్ అండ్ బీ, నీటి పారుదల, విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, డ్వామా, అటవీ, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యానం, పశుసంవర్ధక, హౌసింగ్, నిత్యావసరాలు, ఐసీడీఎస్ తదితర శాఖల తోపాటు అన్ని సంక్షేమ విభాగాల్లో కార్యక్రమాల అమలు, అధికారుల విధులు, బాధ్యతలపై పర్యవేక్షణ, సమీక్షల అధికారాన్ని పీడీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అభీష్టం మేరకు పునర్ ప్రారంభం కానున్న కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో పరుగులు తీయడం ఖాయమని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, కడా కోసం నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా ఇది వరకు విధులు నిర్వర్తించిన వికాస్ మర్మట్‌ను కడా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ప్రభుత్వ నియమించింది. 2019వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆయన.. ఆధ్వర్యంలోనే పనులు సాగనున్నాయని అధికారులు చెబుతున్నారు. వందకోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు చంద్రబాబు. ఆయా ఆభివృద్దికి సంబంధించిన ప్రణాళిక అధికారులు రూపొందిస్తున్నారు. ఇక శాంతిపురం మండల పరిధిలోని కొలమడుగు గ్రామపంచాయతీ రామాపురం వద్ద కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూములను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పరిశీలించారు. ఎయిర్‌పోర్టు సంబంధించిన భూ పరిశీలన వేగంగా సాగుతోంది. ఇక కుప్పంలోని చిగురుకుంట – బిస్సానత్తం గనుల నుంచి బంగారు నిక్షేపాలు వెలికి తీసేందుకు అడుగులు పడుతున్నట్లు సమాచారం.. దానిపై అధికారులు ఓ నివేదికను సిద్ధం చేస్తున్నారటా.. ఆ ప్రాజెక్టు వల్ల వేలమందికి కుప్పంలో ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇలా కుప్పం అభివృద్ధి టార్గెట్ గా చంద్రబాబు పూర్తి స్ధాయిలో దృష్టి పెట్టడమే కాకుండా ఆ పనులు వేగంగా సాగుతుండటంపై కుప్పం ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు.