కూటమీ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. నేను అవినీతి చేసుంటే నిరూపించండి అని ఛాలెంజ్ చేసిన ఆమె.. ఫైల్స్ అన్ని మీ దగ్గరే ఉన్నాయి.. నా తప్పు ఎంటో నిరూపించండి అన్నారు.. జగన్ పుట్టిన రోజుల ఒక పండుగ రోజులా జరుపుకుంటున్నాం.. జగన్ లాంటి నాయకుడు దేశంలో రాష్ట్రంలోను లేడని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అనర్హులు కూడా పెన్షన్లు అందుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది.. ప్రతీ 10 వేల మందిలో ఏకంగా దాదాపు ఐదు వందల మంది అనర్హులే పెన్షన్లు తీసుకుంటున్నట్టు గుర్తించారు.. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణపేదరిక నిర్మూలన శాఖలపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్.. పెన్షన్ లు అర్హత లేనివారికి వస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయని వెల్లడించిన ఆయన.. తాము నిర్వహించిన సర్వేలో ప్రతీ పదివేలకూ 500 మంది వరకూ అనర్హులని తేలినట్టు…
పీడీఎస్ అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తొలి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. పీడీఎస్ అక్రమ రవాణాను సీరియస్‌గా తీసుకుంటున్నాం అన్నారు.. రీసైక్లింగ్ నుంచి స్మగ్లింగ్ కు దారి తీస్తుందన్నారు.. పీడీఎస్ స్మగ్లింగ్ పైన డీ&ఎస్ కింద సెక్షన 301 కిందకు తెచ్చాం.. పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ ఆపేయాలని స్పష్టం చేశారు..
2024-29 ఏపీ మారిటైమ్ పాలసీని విడుదల చేసింది ప్రభుత్వం.. మారిటైమ్ పాలసీ అమలుకు ఏపీ మారిటైమ్ బోర్డును నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఐ అండ్ ఐ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్.. రాష్ట్రంలో పోర్టు ఆధారిత అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులు, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, లాజిస్టిక్స్, ఇతర మారిటైమ్ సేవలు అందించేలా నూతన విధానం రూపొందించింది ప్రభుత్వం.. ఏపీ మారిటైమ్ విజన్ ను ఆవిష్కరించటంతో పాటు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేలా కొత్త…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.. పౌర సేవల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా.. వారికి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా.. వాట్సాప్ ద్వారానే ఏకంగా 153 సేవలను అందించేందుకు సిద్ధమైంది.. వాట్సాప్ ద్వారా పౌరసేవలు అందించే అంశంపై కలెక్టర్ల సదస్సులో ప్రజెంటేషన్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్..
రాష్ట్రంలో ఏకంగా 50 లక్షల మందికి చెందిన సమాచారం లేదని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సచివాలయంలో జరుగుతోన్న రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో.. తొలి రోజు దీనిపై ప్రకటన చేసింది ప్రభుత్వం.. రాష్ట్రంలో 5.4 కోట్ల మంది జనాభాకు గానూ కేవలం 4.9 కోట్ల మంది వివరాలు మాత్రమే ఉన్నాయని.. మిగతా 50 లక్షల మంది పౌరుల సమాచారం ప్రభుత్వం వద్ద లేదని సదస్సులో వెల్లడించింది..
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఇక చకచకా సాగనున్నాయి.. అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. సీఆర్డీఏ అథారిటీ అమోదించిన 20 సివిల్ పనులకు ఆమోదాన్ని తెలియచేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.. రాజధానిలో చేపట్టనున్న ఈ 20 సివిల్ పనులకు 11,467 కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుందని అంచనా వేశారు..
అమరావతిలో భవనాలను పునఃప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. డిసెంబర్ 15వ తేదీ నుండి బిల్డింగ్ యాక్టివిటీని ప్రారంభించనుంది.. ఎంపిక చేసిన కొన్ని కన్స్ట్రక్షన్ మేజర్లకు వివిధ ప్రాజెక్ట్ వర్క్‌లు అప్పజెప్పనున్నారు.. ఇక, పాత కాంట్రాక్టులను రద్దు చేసి తాజాగా బిడ్లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన విషయం విదితమే.. కానీ, సాధ్యమైనంత వరకు పాత కాంట్రాక్టర్ల తోనే పని జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు.. బిడ్డింగ్ ప్రక్రియకు అధికారిక గడువు త్వరలో ముగియగానే ఎంచుకున్న…
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ప్రభుత్వం ఎన్ని సిట్లు ఏర్పాటు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే టీటీడీ లడ్డుపై సిట్, గంజాయిపై ఈగల్, ఇప్పుడు రైస్‌పై సిట్.. ఇవన్నీ ప్రచారం కోసం తప్ప ఏం లేదన్నారు.
సంక్రాంతిలోగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై గుంతలను పూడ్చి వేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రోడ్ల పనులకు రెన్యూవల్ చేయలేదని, ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. టూరిజంకు భారీ నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు.