RK Roja: మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఆర్కే రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓవైపు తప్పులు చేసి మనం ఓడిపోలేదు అని పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూనే.. మరోవైపు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రోజా.. జైల్లో పెడతావా..? పెట్టుకో.. కేసులు పెడతావా? పెట్టుకో.. ఉద్యోగాలు తీసేస్తావా తీసేసెయ్..! మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది.. వడ్డీతో సహా తిరిగి ఇస్తామని హెచ్చరించారు.. ఇక, కూటమి ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డ కార్యకర్తల పేర్లను గుడ్ బుక్‌లో రాసి పెట్టుకుంటాం.. వారిని గుర్తుపెట్టుకుంటామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Pakistan: పామును పెంచిన పాకిస్తాన్.. దాడికి సిద్ధమైన 15,000 మంది తాలిబన్ ఫైటర్స్..
ఉద్యోగస్తులందరూ ఎగిరెగిరి పడ్డారు.. మన ప్రభుత్వాన్ని దించేంతవరకు ఉద్యోగులందరూ కంకణం కట్టుకొని పనిచేశారు.. ఇప్పుడు ఉద్యోగస్తులు అందరూ నరకయాతన అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు ఆర్కే రోజా.. ఇక, పవన్ కల్యాణ్‌కు, చంద్రబాబుకు, లోకేష్ కు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి.. ఏపీ యువతకు ఉద్యోగాలు రాలేదన్న ఆమె.. మనం తప్పులు చేసి ఓడిపోలేదు.. ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఆలీబాబా ఆరడజను దోంగల్లా మారిందని విమర్శించారు.. ఏపీ ప్రజలకు నరకం అంటే ఎంటో కూటమి ప్రభుత్వం చూపిస్తుందన్నారు.. జగన్‌ను ఓడించి తప్పుచేశామని ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.. పశ్చాత్తాప పడుతున్నారని వ్యాఖ్యానించారు.. సంపద సృష్టిస్తా అని చెప్పి అప్పుల మీద అప్పులు చంద్రబాబు సృష్టిస్తున్నారు… ఎన్నికల ప్రచారంలో పచ్చ చొక్కాలు వేసుకుని, పచ్చ చీరలు కట్టుకుని నీకు 15 వేలు నీకు 15 వేలు అంటూ అబద్దాలు చెప్పారని మండిపడ్డారు.. జగన్ బిజినెస్ మాన్ గా, పార్టీ అధినేతగా, ఫ్యామిలీ మెన్ గా సక్సెస్ అయిన వ్యక్తిగా అభివర్ణించారు ఆర్కే రోజా..
Read Also: Asma Assad: ప్రాణాపాయ స్థితిలో సిరియా మాజీ అధ్యక్షుడి భార్య అస్మా.. చేతులెత్తేసిన వైద్యులు!
మరోవైపు.. పార్టీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉద్దేశించి మరోసారి పరోక్షంగా ఫైర్ అయ్యారు మాజీ మంత్రి రోజా… మన పార్టీలోని కొందరు చేసిన దిగజారుడు రాజకీయాల వల్ల ఎప్పుడూ అత్యధిక స్థానాలు గెలిచే జిల్లాలో ఈసారి గెలవలేకపోయామన్నారు.. వచ్చే ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా భుమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కుప్పంతో సహా 14 స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా..