AP Registration Charges : ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 1 నుంచి భూముల మార్కెట్ ధరలను పెంచే నిర్ణయంపై వెనకడుగు వేసింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవడంతో, ఈ నిర్ణయంపై పునరాలోచన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2025 జనవరి 1 నుండి భూముల మార్కెట్ ధరలను పెంచే యోచన తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ నిర్ణయంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి, అవసరమైన మార్పులు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రజల్లో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వం దృష్టిలోకి తీసుకువెళ్లింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025 జనవరి 1 నుండి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమలులోకి తీసుకురావాలని భావించారు. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు కొత్త ధరలను ప్రతిపాదించి, ప్రజాభిప్రాయం సేకరించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది.
భూములకు ఉన్న డిమాండ్‌ను, ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలించి కొత్త ధరలపై ముసాయిదాలు తయారు చేయాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంపై ప్రజల నుంచి, ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సూచనలతో మార్కెట్ ధరల పెంపు నిర్ణయం పునరాలోచనకు గురైంది. ప్రజా ప్రతినిధుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చిందని సమాచారం.
గత ఐదేళ్లలో భూముల మార్కెట్ రిజిస్ట్రేషన్ ధరలను పెంచడం వల్ల ప్రజలపై తీవ్ర భారం పడింది. పట్టణాల్లో రిజిస్ట్రేషన్ ధరలు మార్కెట్ ధరలకు సమానంగా చేరాయి. ఈ సమయంలో టీడీపీ ధరల పెంపుదలపై వ్యతిరేకంగా నిలిచింది. రియల్ ఎస్టేట్ క్షీణించినా, ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే కోసం 14,000 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించే ప్రయత్నం చేసింది.
ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో కలకలం నెలకొంది. భూములు, అపార్ట్‌మెంట్ల అమ్మకం భారీగా పడిపోయింది. 2025 జనవరి 1 నుండి భూముల మార్కెట్ ధరల పెంపు అమలు చేసే నిర్ణయంతో ప్రజలు ఆందోళనకు దిగారు. అందుకే, ఈ అంశంపై సమగ్రంగా చర్చించి, జనవరి 1 నుండి భూముల ధరల పెంపు అమలును వాయిదా వేసినట్టు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు.
ఏపీ రియల్ ఎస్టేట్ ఇప్పటికే కుదేలై ఉంది. 2022లో రిజిస్ట్రేషన్ విలువలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్ ధరలకు సమానంగా ఉండే రిజిస్ట్రేషన్ ధరలు లావాదేవీలను తగ్గించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆదాయం పెంచుకునేందుకు పాత ప్రభుత్వ బాటలోనే కొనసాగుతోంది.
రాష్ట్రంలోని అన్ని జిల్లా శాఖల నుంచి రిజిస్ట్రేషన్ విలువల సవరణకు ప్రతిపాదనలు సేకరించారు. ఈ నిర్ణయంతో ఈ ఏడాది డిసెంబర్‌లో రిజిస్ట్రేషన్లు పెరిగే అవకాశం ఉంది. 2025 నుండి పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి కొత్త విలువలు అమలులోకి రానున్నాయి. 10% నుంచి 15% వరకు రిజిస్ట్రేషన్ విలువలు పెరిగే అవకాశం ఉంది. అయిదే.. దీనిపై సోమవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Realme 14 Pro Launch: భారత్‌కు రంగు మారే స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ప్రపంచంలోనే మొదటి మొబైల్!