కల్వరి టెంపుల్‌ను ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించారంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుంటూరు జిల్లా నంబూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్వరి టెంపుల్‌కు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు అంటూ పరస సురేష్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
Cabinet Sub Committee : అమరావతిలో భూ కేటాయింపులపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో, రాజధానిలోని పలు సంస్థలకు భూమి కేటాయింపులు చేసే అంశంపై మంత్రుల కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ లో మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్, టీజీ భరత్ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కమిటీ, గతంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించనుంది.…
ప్రభుత్వం 'సూపర్ సిక్స్ హామీలు' కింద అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్దిదారులకు అందించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Nimmala Ramanaidu : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు కొన్ని కీలకమైన చట్ట సవరణలపై శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే.. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి 2019 జనవరి 29 న 1942 కోట్లతో పాలన అనుమతులు ఇచ్చామని తెలిపారు. వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం 4819 ఎకరాలు భూసేకరణ చేయాల్సి వస్తే , వైసిపి కేవలం 9…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు కొన్ని కీలకమైన చట్ట సవరణలపై శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లు 2024తోసహా మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు 2024ను ప్రభుత్వం శాసనసభకు సమర్పించింది.
Raghu Ramakrishna Raju : ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ పదవికి ఒక్క నామినేషనే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. అయితే.. ఎన్డీయే కూటమి తరఫున శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. రఘురామతో పాటు మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్…
ఏపీ అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ బిల్లు - 2024, ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ బిల్లు- 2024 బిల్లులను మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు అసెంబ్లీలో మూడు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఏపీ పంచాయితీ రాజ్ బిల్లు - 2024 ను అసెంబ్లీలో డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ ప్రవేశ పెట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఖాళీగా పదవులను భర్తీ చేస్తూ వస్తోంది. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల్లో పలువురు నేతలను నియమించిన కూటమి సర్కార్.. తాజాగా శాసనసభ, శాసనమండలి చీఫ్ విప్, విప్‌లను నియమించింది. శాసనసభలో ముగ్గురు జనసేన, ఒక బీజేపీ సభ్యుడికి అవకాశం దక్కింది. శాసనసభ చీఫ్ విప్‌గా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, శాసనమండలి చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు.