ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో పలువురు మంత్రులు పాలు పంచుకున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. "చంద్రబాబు హయాంలో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ వైసీపీకి చెందిన నేత ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 లో మంత్రి ఇక్కడ నుంచి ఉన్నా అభివృద్ధి లేదు. యువ గళం పాదయాత్ర సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పుడు…
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యబీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. తెలంగాణలోని ఆస్పత్రుల్లోనూ వైద్య సేవలు, చికిత్స పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కిన తండేల్ సినిమా యూనిట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ లలో ఒక్కొక్క టికెట్ మీద 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో ఒక్కొక్క టికెట్ పైన 75 రూపాయలు పెంచుకునే సౌలభ్యం కలిగించింది. ఇక సినిమా రిలీజ్ అయిన వారం రోజులు వరకు ఈ రేట్లు పెంచి అమ్ముకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఆంధ్రప్రదేశ్లోని…
సీఎం చంద్రబాబుతో సినీ హీరో సోనూసూద్ సమావేశం అయ్యారు. తమ ట్రస్ట్ వివరాలు సీఎంకు సోనుసూద్ వివరించారు. తన ట్రస్ట్ తరఫున ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్ లు అందించనున్నారు సోనుసూద్. ఇక ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలు నా గుండెల్లో ఉంటారు, తెలుగు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. ఇవాళ మా ట్రస్ట్ తరపున అంబులెన్స్ లు ప్రభుత్వానికి అందించాము, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి జరుగుతోంది అన్నారు. KP Chowdary: డ్రగ్స్ కేసు…
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. పలు అంశాలపై చర్చ పోలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. మహానాడు రెండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. కడప జిల్లాలో మహానాడు నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజన పై పొలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో తగ్గిన బీసీ కోటా రిజర్వేషన్ పునరుద్ధరించేలా చట్టపరమైన అంశాలు పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. "వైసీపీ పెట్టిన అక్రమ కేసుల్ని నిర్ణీత కాలపరిమితిలో ఎత్తివేసేలా చూడాలని నిర్ణయించాం. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా వారికి చెల్లించాల్సిన మొత్తం భూమి రూపంలో ఇచ్చేలా ఆలోచన చేస్తున్నాం.
జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో జగన్ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం బయటపడిందని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఆయన ప్రచారానికి మేనమామ, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైందని విమర్శించారు. "పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని తేటతెల్లం అయ్యింది.
వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది. విజయవాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో నారాయణ దాఖలు చేసిన కేసుకు సంబంధించి వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కౌంటర్ దాఖలు చేసేందుకు మంత్రి నారాయణ తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూద్రా సమయం కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతుంది.. వచ్చే నెల మూడో వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆర్ధిక శాఖ కసరత్తు చేస్తోంది..
ప్రజలే ఫస్ట్... అనే నినాదంతో అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై ప్రజల అభిప్రాయలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి ఆధారంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు..