AP Government: షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో రేపు అనగా ఈ నెల 23వ తేదీన గ్రూప్-2 పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. డీజీపీ.. ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.. అయితే, చివరి గంటల్లో గ్రూప్-2 పరీక్షల్లో పెద్ద ట్విస్ట్ వచ్చి చేరింది.. గ్రూప్- 2 మెయిన్స్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం.. రేపు నిర్వహించాల్సిన పరీక్ష కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.. రోస్టర్ తప్పుల సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి.. దీంతో, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి లేఖ రాసింది.. ప్రస్తుతం కోర్టులో రోస్టర్ అంశంపై పిటిషన్‌పై విచారణ సాగుతోంది.. వచ్చే నెల 11వ తేదీన మరో మారు విచారణ జరగనుంది.. కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.. ఒక వైపు గ్రూప్- 2 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు.. గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనలను గుర్తించి ఏపీపీఎస్సీకి లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
Read Also: Punjab: “ఉనికిలో లేని” శాఖకు 20 నెలలుగా మంత్రి.. ఆప్ సర్కార్‌పై బీజేపీ విమర్శలు..