భూ సంస్కరణల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం.. అసైన్మెంట్ కమిటీలను ఏర్పాటు చేసింది.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. జిల్లా ఇంఛార్జ్ మంత్రి చైర్మన్ గా.. జిల్లా మంత్రి.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే.. జాయింట్ కలెక్టర్.. ఆర్జీవో సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం..
ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు.. దాదాపు 6,200 కోట్ల రూపాయాలు చెల్లించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈసారి కూడా ప్రతిపక్షం లేకుండానే జరిగాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరవడం మినహా... ఆ తర్వాత వైసీపీ నుంచి హాజరు లేదు. అదే సమయంలో... కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది కాస్త ముందుకు వెళ్ళి.... వాళ్ళు లేకపోతేనేం.... మేమున్నాంగా.... అంటూ, ఏకంగా ప్రతిపక్ష పాత్ర పోషించేశారు. ధూళిపాళ్ళ నరేంద్ర, కూన రవికుమార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి..
Botsa Satyanarayana: సభలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. కానీ, ప్రభుత్వం మార్షల్స్ ను తెచ్చి మమ్మల్ని సభ నుంచి బయటికి పంపించేందుకు చూసిందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్లో 27,400 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని దాఖలైన పిల్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.. సెక్షన్ 26 విద్యా హక్కు చట్టం కింద టీచర్ పోస్టులు 10 శాతం కంటే ఎక్కువ ఖాళీగా ఉండకూడదనీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. 27 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కోర్టుకు తెలిపారు..
CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) ఈ నెల 18న ఢిల్లీ (Delhi) వెళ్లనున్నారు. ఈ పర్యటన రాజకీయంగా, పరిపాలనా పరంగా ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా అమరావతి రాజధాని (Amaravati) అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కించేందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi)తో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా అమరావతిలో మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మోడీని అధికారికంగా…
పార్లమెంట్లో ఎంపీలకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇచ్చినట్టుగానే.. ఆంధ్రప్రదేశ్లో ప్రతీ ఏడాది ఉత్తమ లెజిస్లేటర్ అవార్డు కూడా ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ 2025-26 సమావేశాల నుంచి వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల వరకు సభలో సభ్యుల పనితీరును పరిగణనలోకి తీసుకుని.. ఉత్తమ లెజిస్లేటర్ అవార్డుకు ఎంపిక చేయబోతున్నారు..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గతంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి పునఃనిర్మాణంపై ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే అన్ని అడ్డంకులను అధిగమించి.. రాజధాని పనుల ప్రారంభానికి సిద్ధం అవుతోంది.. ఈ నేపథ్యంలో అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించింది ఏపీ సర్కార్..
టీటీడీ దర్శనాలపై ఏపీ సీఎం చంద్రబాబుకి మంత్రి కొండా సురేఖ తెలంగాణ దేవాదాయ శాఖ లేఖ రాశారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి దర్శనం కోసం సిఫార్సు లేఖల వ్యవస్థను తిరిగి తీసుకువచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి తెలంగాణ ప్రజా ప్రతినిధులందరికీ ఉపయోగపడుతుందని, వారందరి తరపున తాను ఏపీ సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. అయితే, తెలంగాణ నుంచి తిరుమలను సందర్శించే భక్తుల సంఖ్య…
ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హయగ్రీవ ఫార్మ్ అండ్ విల్లాస్ అక్రమాలు పుట్ట పగిలింది. వృద్ధులు, అనాథల పేరుతో తక్కువ ధరకు భూములు తీసుకుని వేల కోట్లు వ్యాపారం చేసిన రియల్టర్లుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నగరంలో అత్యంత వివాదాస్పద భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.