రైతు సమస్యలపై ఫోకస్ పెంచింది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం.. తాజాగా పొగాకు, మామిడి, కోకో కొనుగోళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పొగాకు రైతుల సమస్యలకు చెక్ పెట్టేందుకు మార్క్ ఫెడ్ నుంచి కొనుగోలు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తుని రైలు దగ్ధం కేసుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. అసలు తుని కేసు తిరగదోడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పింది.. తుని కేసును కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్ కు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది..
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి రేషన్ దుకాణాల్లో వస్తువులు ఇవ్వడం ప్రారంభమైంది.. వాహనాల్లో కాకుండా రేషన్ షాపుల్లోనే ఇకనుంచి ఆయా వస్తువులు ఇవ్వనున్నారు.. దీంతో వైసీపీ-టీడీపీ నేతలు మధ్య పరస్పరం విమర్శలు మొదలయ్యాయి.
ఈ ప్రభుత్వం పేదలు కోసం పని చేస్తుందని.. 64 లక్షలు మందికి ఒకటవ తేదీన పింఛన్ లు అందిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 34 వేలు కోట్లు రూపాయలు పింఛన్ డబ్బులు ఇప్పటి వరకు అందించామన్నారు. ముఖ్యమంత్రి తాజాగా మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. భగవంతుడు దయ చూపిస్తే పింఛన్ పెంచుతామని తెలిపారు.
కొందరు వివాదం కోసం మాట్లడుతుంటారు.. మరికొందరు ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోదామని వాయిస్ పెంచుతుంటారు. కానీ... వాటన్నిటితో సంబంధం లేకుండా... మనసులో ఏది ఉంటే అది మాట్లాడి.. నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి కేంద్రంగా జేసీ బ్రదర్స్ రాజకీయాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది.
జనాభా పెరగాలని ఇప్పటికే స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, జనాభా పెరగడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయనే చర్చ కూడా మరోవైపు సాగుతోంది.. దీంతో 20 రోజుల పాటు ప్రత్యేక సర్వే నిర్వహించడానికి సిద్ధమైంది ప్రభుత్వం.. వైద్య ఆరోగ్య.. మహిళా శిశు సంక్షేమ శాఖలకు ఈ బాధ్యతలు అప్పగించారు.. ప్రతి ఇంటిలో సర్వే నిర్వహించి.. వారి అభిప్రాయాలు సేకరించబోతున్నారు..
రైతులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం.. ఖరీఫ్ పంట బీమా పథకాలకు నిధులు విడుదల చేసింది సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్.. ఖరీఫ్ పంట బీమా పథకానికి 132 కోట్ల 58 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. అధికారికంగా ఎన్టీఆర్ జయంతి వేడుకులను జరపాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక నుండి ప్రతీ సంవత్సరం మే 28 తేదీన ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం...
తెలుగు నాట సినీ పరిశ్రమను, రాజకీయాలను వేరువేరుగా చూడటం కష్టం. ఆ లింకులన్నీ అలా సింక్ అయి ఉంటాయి మరి. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందట. తమకు ఆర్ధిక సమస్యలు ఉన్నాయంటూ... సినీ ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ముందు ప్రకటించి తర్వాత అది వివాదాస్పదం కావడంతో.... ఉపసంహరించుకున్నారు. ఎగ్జిబిటర్ల ఉద్దేశ్యం ఏదైనా... దాని మీద భిన్న వాదనలున్నా.... బంద్ ప్రకటనతో పవన్కళ్యాణ్కు మాత్రం కాలిపోయిందట. తన సినిమా…