AP Government: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి.. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. దీనిపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్.. రాష్ట్ర స్థాయి వేడుకగా కూటమి ఏడాది పాలన నిర్వహించాలని నిర్ణయించారు.. జూన్ 12వ తేదీన అంటే ఎల్లుండి సాయంత్రం ఈ వేడుకలు నిర్వహించనున్నారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆల్ ఇండియా ఆఫీసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించాలని స్పష్టం చేసింది.. దీనికి సంబంధించిన తగిన ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది కూటమి సర్కార్.. ‘సుపరిపాలన.. స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరుతో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు.. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు పాల్గొంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ సర్కార్..
Read Also: Balakista Reddy: ఆగస్టు 14 లోపు ఇంజినీరింగ్ తరగతులను ప్రారంభిస్తాం.. డబ్బులు వృధా చేసుకోవద్దు!
మొత్తంగా “సుపరిపాలన.. స్వర్ణాంధ్ర ప్రదేశ్” పేరుతో కూటమి ఏడాది పాలన రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించనుంది ఏపీ సర్కార్… ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ఎల్లుండి అంటే జూన్ 12 నాటికి ఏడాది పూర్తి కానుంది. దీనిని ప్రభుత్వం ఒక వేడుకలా ఎల్లుండి సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహించనుంది.. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొంటారు.. ఎంపీలు.. కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.. ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా ఈ సమావేశంలో వివరించనున్నారు.