స్టార్ హోటళ్లలో నిర్వహించే బార్ల లైనెన్స్ ఫీజులు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ల ఛార్జీలను తగ్గిస్తూ శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో త్రి స్టార్ సహా ఆ పై స్థాయి హోటళ్లలో బార్ల లైసెన్సు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.. లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీని రూ.66 లక్షల నుంచి రూ.25 లక్షలకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.. పర్యాటకంతో పాటు ఆతిథ్యరంగానికి ఊతమిచ్చేలా బార్ల రిజిస్ట్రేషన్ ఛార్జి, లైసెన్సు ఫీజులను తగ్గిస్తూ…
హిట్ ఫ్రాంచైజ్లో భాగంగా వస్తున్న మూడో చిత్రం హిట్ 3. ఈ సిరీస్లో మొదటి రెండు చిత్రాలు (హిట్: ది ఫస్ట్ కేస్, హిట్: ది సెకండ్ కేస్) ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా థర్డ్ ఎడిషన్ మే ఒకటవ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో మరోసారి చర్చ ఊపందుకుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రాబోయే చిత్రం…
సంపద సృష్టి తక్కువ.. అప్పులు ఎక్కువ.. అంటూ కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ మాజీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఆర్థిక పరిస్థితి.. అప్పు.. సంపద పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించిన ఆయన.. కేంద్రంలో మద్దతు ఉంది అని చెప్పుకుంటున్నారు..
ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఏర్పాట్లకు సంబంధించి ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు దారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. మంత్రులు పొంగూరు నారాయణ, నారా లోకేష్, పయ్యావుల కేశవ్, సత్యకుమర్ యాదవ్, నాదెండ్ల మనోహర్.. కొల్లు రవీంద్ర సభ్యులుగా ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేసిన కూటమి సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చే సింది. ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్ల పరిశీలన.. సభ జరిగే ప్రాంతంలో ఏర్పాట్లు ... ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని…
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన దళిత యువకుడి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ అనంత బాబు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణ వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదిగా రాజమండ్రికి చెందిన మొక్కల సుబ్బారావును నియమించారు.
వివిధ ప్రభుత్వ సేవలపై ఏపీ ప్రభుత్వం ప్రజాభిప్రాయం సేకరిస్తోంది.. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య పౌర సేవలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే నిర్వహించింది.. అయితే, ఈ సర్వేలో కొన్ని షాకింగ్ విషయాలతో పాటు.. మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఏపీ ఫైబర్ నెట్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్లో దాదాపు 500 మంది ఉద్యోగులను సర్కార్ తొలగిస్తూ సంచలన నిర్ణయానికి వచ్చింది.. సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరు కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి ఔట్ అవ్వనున్నారు..
మీరంతా ప్రభుత్వ విద్య పరువును కాపాడారు.. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను చెరిపేశారు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. మీరంతా విజేతలు.. మీకు హ్యాట్సాఫ్.. మీ అందరితో ఇలా కూర్చోవడం నా అదృష్టం.. మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాని భావోద్వేగానికి గురయ్యారు. ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యనభ్యసించి మార్కుల్లో రాష్ట్రస్థాయి టాపర్ లుగా నిలిచిన 52…
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో రేపటి నుండి క్యాన్సర్ కేసుల అంశంపై మరోసారి సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. క్యాన్సర్ కేసులు విషయంలో అధికారుల లెక్క, వాస్తవ పరిస్థితులకు భిన్నమైన వాదన ఉన్న నేపథ్యంలో గ్రామంలో మరోసారి సమగ్ర సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి రొమ్ము, గర్భాశయ, ముఖద్వారం, ఓరల్ క్యాన్సర్ ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో జిల్లా వైద్యాధికారులు చర్చించి…