వైఎస్ జగన్ చూస్తే కూటమి నాయకులకు భయం, అందుకే రైతుల వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి..
బనకచర్ల ప్రాజెక్ట్ పై కేంద్ర జలసంఘం అభ్యంతరాలపై దృష్టి పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్ర అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం.. ఏపీ ఇరిగేషన్ సలహదారు అధికారులతో సమావేశం అయ్యారు.. అయితే, కేంద్ర జలసంఘం.. అడిగిన లెక్కలుపై చర్చ సాగుతోంది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్.. నీటి లెక్కలపై అధ్యయనం చేస్తోంది.
మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా.. రాష్ట్రంలో పాలన ఉంది అంటూ కూటమి సర్కార్పై మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ప్రతిరోజూ వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును చంపేందుకు ప్రయత్నించారు. పొన్నూరు ఎమ్మెల్యేకి తెలియకుండానే ఈ హత్యాయత్నం జరిగిందా? అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది.. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేడు అధికారులతో రెవెన్యూ శాఖ సమీక్ష సమావేశంలో నిర్వహించారు సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా ఆదేశించారు.. ఇందు కోసం ముగ్గురు మంత్రులతో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, పొంగూరు నారాయణతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
మామిడి రైతులకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం.. మామిడి రైతుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనవసర రాజకీయాలు చేస్తుందంటూ మండిపడుతున్నారు ప్రభుత్వ పెద్దలు.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా కిలోకి 4 సబ్సిడీ ఇచ్చి రైతులకు అండగా నిలబడిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నష్టాన్ని ముందుగానే అంచనా వేసి మామిడి రైతులను ఆదుకోవాలని సబ్సిడీ ఇచ్చామంటున్నాయి ప్రభుత్వ వర్గాలు..
ఏపీలో ఆలిండియా సర్వీస్ అధికారులు ఎక్కువగా రాజకీయ వివాదాల్లో చిక్కుకుంటున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. ప్రభుత్వాలు మారినప్పుడు ఒకరిద్దరు ఐఎఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఇబ్బందులు పడటం, వివాదాల్లో ఇరుక్కోవడం గతంలో కూడా ఉన్నా... ఇప్పుడు అదే పెద్ద వ్యవహారంగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు.
ఏపీ బీజేపీ వైఖరి మారుతోందా అంటే.... లేటెస్ట్ వాయిస్ వింటుంటే అలాగే అనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరీ ముఖ్యంగా... పదవుల విషయంలో వాళ్లు తీవ్రంగా రగిలిపోతున్నట్టు కనిపిస్తోందని, రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడి పదవీ స్వీకార కార్యక్రమం వేదికగా ఆ అసంతృప్తి బయటపడిందని చెప్పుకుంటున్నారు. ఎంతసేపూ.... తమను ఫైవ్ పర్సంట్ వాటాదారుగానే చూస్తున్నారని, ఆ కోణం మారి ప్రాధాన్యం పెంచాలన్నదే ఏపీ కాషాయ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది.
శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో పంపిణీ చేసే లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి.. అయితే, లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందన్న ఆరోపణల వెనుక కుట్రకోణం ఉందంటున్నారు ఆలయ ఈవో శ్రీనివాసరావు.. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిపారు.. అంతేకాదు, శ్రీశైలం పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు.. దేవస్థానం సీసీ టీవీ ఫుటేజీ పరిశీలనతో ఆ కుట్రకోణం వెలుగులోకి వచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.. శ్రీశైలం దేవస్థానంపై దుష్ప్రచారం చేసేలా కుట్రకు పాల్పడ్డారని ప్రభుత్వానికి ఈవో నివేదిక ఇచ్చారు..
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. నంద్యాల జిల్లాలో అరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు ఇచ్చిన పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ ప్రాజెక్టును రద్దు చేసింది.. 800 మెగావాట్ల అవుకు పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు..