Electricity Bill Shock: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలం, మామిడికుదురు గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ నన్నేషా హుస్సేన్ ఇంటికి రూ. 15,14,993 కరెంట్ బిల్లు వచ్చి తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
AP Govt: ఫీజు రియంబర్స్ మెంట్ కోసం 600 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేశామని ఉన్నత విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించారని.. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. చిత్తూరు పర్యటనలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. జగన్ వస్తున్నాడని తెలిసి, ఇక్కడ 2 వేల మంది పోలీసులను మొహరించి, రైతులను రానివ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారని.. చివరకు టూవీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారన్నారు. ఇక్కడికి కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎందుకు అన్నారు. ఎందుకీ…
వైఎస్ జగన్ మామిడి రైతాంగాన్ని పరామర్శించే చిత్తూరు జిల్లా పర్యటనకు అడ్డుకునేందుకు.. బంగారుపాళ్యం పర్యటనను వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. మూడు వేల మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. పెట్రోల్ బంకుల వద్ద పోలీసులను కాపలా పెట్టారు.
AP Cabinet: రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతిలో 20, 494 ఎకరాల భూ సమీకరణకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
Botsa Satyanarayana: కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ వాగ్దానాలు ఎందుకు అమలు చేయడం లేదని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గత నెల 30వ తేదీన విజయవాడలో జరిగిన 'అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్ నిర్వహించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ఈ వర్క్‌షాప్ ద్వారా ప్రభుత్వ, పరిశ్రమ, విద్యా సంస్థలు, స్టార్టప్‌లు కలిసి కొత్త టెక్నాలజీని సమన్వయంతో పనిచేసే దిశగా చర్చలు తీసుకోవాలని తెలిపింది ప్రభుత్వం.
తోతాపురి మామిడి రైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఇప్పటి వరకూ 3,08,261 మెట్రిక్ టన్నుల మేర తోతాపురి మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు రైతుల నుంచి కొనుగోలు చేశాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రమలు తమ సామర్ధ్యం మేరకు మామిడిని కొనుగోలు చేస్తున్నాయి.