Electricity Bill Shock: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలం, మామిడికుదురు గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ నన్నేషా హుస్సేన్ ఇంటికి రూ. 15,14,993 కరెంట్ బిల్లు వచ్చి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రతి నెల సగటున రూ. 1300 వరకు బిల్లు వచ్చేది.. కానీ, ఈ నెల ఇలా భారీ మొత్తంలో బిల్లు రావడంపై ఆయన ఎలక్ట్రిసిటీ శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ మీటర్లు వచ్చినప్పటి నుంచి సామాన్యులపై కరెంట్ బిల్లుల భారం అధికమైందని రిటైర్డ్ టీచర్ నన్నేషా హుస్సేన్ వాపోయారు. సంబంధిత అధికారులు ఈ విషయాన్ని విచారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.