Ramayapatnam Port: రామాయపట్నం పోర్టుపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం.. రామాయపట్నం పోర్టు కనెక్టివిటీ పెంపు ప్రతిపాదనపై దృష్టిసారించింది.. పరిశీలనకు ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది.. ఆర్థిక, ఐ అండ్ ఐ, టూరిజం శాఖల మంత్రులతో ఉప సంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది.. ఆర్ధిక, మౌలిక వసతులు, పెట్టుబడులు, టూరిజం శాఖల మంత్రులతో ఉప సంఘం ఏర్పాటు చేశారు.. రామాయపట్నం పోర్టు పునరుద్ధరణ, డ్రెడ్జింగ్, అంతర్గత, బాహ్య రోడ్డు, రైలు కనెక్టివిటీని పెంచే ప్రతిపాదనలు పరిశీలన చేయనుంది మంత్రివర్గ ఉప సంఘం.. ప్రతిపాదనలను పరిశీలించి తగిన సిఫార్సులు చేయాలని మంత్రి వర్గ ఉపసంఘానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక, ఫేజ్ -1 పనులను పూర్తి చేయడానికి సమయం పొడిగింపు అంశాన్నీ పరిశీలించాలని పేర్కొంది ప్రభుత్వం.. తగిన ఏర్పాట్లు చేయాలని మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ కార్యదర్శిని ఆదేశించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్..
Read Also: stuntman Mohanraju death : మా తప్పేం లేదు.. స్టంట్ మ్యాన్ మృతిపై డైరెక్టర్ రంజిత్ క్లారిటీ..