ఏపీలోని విజయవాడలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఛలో విజయవాడ పేరుతో అనేక ప్రాంతాల నుంచి ఉద్యోగులు తరలివచ్చి ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలపై ఆందోళన నిర్వహించారు. అయితే ఈ ఆందోళనలో బెజవాడ ఆడపడుచులు తమ వంతు సహకారం అందించారు. భారీ స్థాయిలో తరలివచ్చిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ మంచినీటి బిందెలు ఏర్పాటు చేసి ఉద్యోగుల దాహర్తి తీర్చారు. ఈ సందర్భంగా తమ ఆందోళనల పట్ల విజయవాడ మహిళలు…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం సందర్భంగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల నిరసనలపై జగన్ ప్రభుత్వ నియంతృత్వ తీరును ఆయన ఖండించారు. లక్షల మంది సమస్యపై అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలని, ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా అని చంద్రబాబు నిలదీశారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. Read Also: ఉద్యోగులతో…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డు మొత్తం కనుచూపు మేర ఉద్యోగులతో నిండిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద స్థాయిలో ఏ ఉద్యమంలోనూ ఇంతమంది పాల్గొన్న దాఖలాలు లేవు. పోలీసులు జిల్లాల్లోనే కొందరు ఉద్యోగులను అడ్డుకున్నా.. మారు వేషాల్లో చలో విజయవాడకు ఉద్యోగులు తరలివచ్చారు. రైతులు, కూలీల వేషంలో ఉద్యోగులు విజయవాడ చేరుకున్నట్టు అనేక…
పీఆర్సీ అమలు విషయంలో ఏపీ ప్రభుత్వం తమను తప్పుదోవ పట్టిస్తోందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈరోజు జరిగిన చర్చల్లో మూడే అంశాలు చెప్పామని, మంత్రుల కమిటీ కొంత సమయం తర్వాత అభిప్రాయం చెప్తామని తమను మభ్యపెట్టిందని… సాయంత్రానికి తమ డిమాండ్లు సాధ్యపడవు అని ఒక సందేశంలో రూపంలో పంపిందని బండి శ్రీనివాసరావు తెలిపారు. మంత్రుల కమిటీతో చర్చలు విఫలమైనందున ఈనెల 3న తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులను భయపెట్టవద్దని,…
ఏపీలో పీఆర్సీ రగడ మాములుగా జరగడం లేదు. ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అన్నట్టు తయారైంది పరిస్థితి. ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తామని చెబుతున్నా ఉద్యోగులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. డిమాండ్లు సాధించుకునేందుకు ఎంతవరకైనా వెళ్తాం అని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. తాజాగా ఏపీ ఉద్యోగుల ఛలో విజయవాడకు అనుమతి ఇవ్వొద్దని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. Read Also: ఉద్యోగుల ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కొత్త జిల్లాల ప్రతిపాదన:…
ఉద్యోగులు సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోబోమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు డిమాండ్లు పరిష్కరిస్తేనే ఉద్యోగులు చర్చలకు వస్తామని చెబుతున్నారన్నారు. జీవోలు విడుదల అయినందున ప్రభుత్వం కొత్త జీతాలను ఇస్తుందన్నారు. ఉద్యోగులు ముఖ్యమంత్రి పై తూలనాడి మాట్లాడితే సంఘం నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. మేము కూడా మాట్లాడితే మరింత ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని మంత్రి…
ఏపీ పీఆర్సీ రగడ సామాన్య ఉద్యోగులను తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వం చర్చలు అంటూనే .. తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నాయి. మరోవైపు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లు నేరవేరిస్తేనే చర్చలకు వెళ్తామంటూ భీష్మించుకుని ఉన్నారు. దీంతో సగటు ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సు పెంపునకు సంబంధించి ఇంకా జీవో ఇవ్వకపోవడంతో అయోమయం నెలకొన్నది. Read Also: ఎన్జీవో హోంలో వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల భేటీ ఇప్పటికే ఆయా…
ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని ఏపీ ఏన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. 3వ తేదిన జరిగే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. కొత్త పీఆర్సీ అమలులోకి వస్తే ఉద్యోగుల పరిస్థితి రివర్స్ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రుల బృందం కావాలనే రెచ్చగొడుతుందన్నారు. మిశ్రా కమిటీ సిఫార్సు బయటపెట్టమని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఉనికిలో లేని ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించి మమ్ముల్ని అవమానపరిచారననారు. Read…
ఏపీలో పీఆర్సీ రగడ ఇప్పట్లో తేలేలా లేదు. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వనించినప్పటీకి వారు రాలేదు. దీంతో మంత్రుల కమిటీ వెనుదిరిగింది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం మా డిమాండ్‌లు నేరవేర్చడంతో పాటు తాము పెట్టే షరతులకు ఒప్పుకుంటేనే చర్చలకు వస్తామని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించే అంశంతో పాటు వారిని దారికి తెచ్చేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలకు ప్రభుత్వం…
ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఉద్యోగులకు పాత జీతాలే ఇవ్వాలని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమానికి సహకరిస్తున్న ట్రెజరీ ఉద్యోగులు, డీడీఓలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుందని వెంకట్రామిరెడ్డి అన్నారు. పాత జీతమే ఇవ్వాలని ప్రతి ఉద్యోగి డీడీఓలు.. హెచ్‌వోడీల వద్దకు వెళ్లి రాతపూర్వకంగా కోరాలన్నారు. దీని నిమిత్తం ఓ ప్రోఫార్మా రూపొందించామని తెలిపారు. చర్చలకు వచ్చే విషయంలో మా డిమాండ్లు ఏంటో…