ఏపీలో పీఆర్సీ రగడ మాములుగా జరగడం లేదు. ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అన్నట్టు తయారైంది పరిస్థితి. ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తామని చెబుతున్నా ఉద్యోగులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. డిమాండ్లు సాధించుకునేందుకు ఎంతవరకైనా వెళ్తాం అని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. తాజాగా ఏపీ ఉద్యోగుల ఛలో విజయవాడకు అనుమతి ఇవ్వొద్దని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Read Also: ఉద్యోగుల ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కొత్త జిల్లాల ప్రతిపాదన: కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి
ఉద్యోగుల సభకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలివ్వాలని లంచ్ మోషన్ విచారణను పిటిషనర్ కోరారు. అయితే కోర్టు ఈ విషయంపై తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ప్రభుత్వానికి రిప్రజంటేషన్ ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. కోవిడ్ మేనేజ్‌మెంట్ రూల్స్ ఉన్నందున దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు చెప్పింది. లంచ్ మోషన్ విచారణకు న్యాయస్థానం నిరాకరించింది.