పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాలని ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సీఎంవోతో అధికారులు చర్చలు ముగిసిన అనంతరం మీడియాతో ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు. ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏను తగ్గించడంపై ఉద్యోగులు ఆందోళన చేపట్టనున్నారు. పీఆర్సీ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏలను భారీగా తగ్గించడంపై సచివాలయ ఉద్యోగుల అసంతృప్తి. పీఆర్సీ జీవోలన్ని ఉద్యోగులకు నష్టం కలిగించేలా ఉన్నాయని బండి వెంకట్రామిరెడ్డి అన్నారు. Read Also: తెలంగాణ ఆర్టీసీకి కలిసొచ్చిన సంక్రాంతి.. రూ.107 కోట్ల ఆదాయం…
ఏపీలో ఉద్యోగసంఘాలు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది. సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు క్యాంప్ కార్యాలయానికి రానున్నారు. పీఆర్సీ, హెచ్ఆర్ఏ, సీసీఏ రద్దును వ్యతిరేకిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా సహకరించాలని కోరుతోంది ప్రభుత్వం. జీవోలు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన బాటలో వెళతాం అంటున్నారు ఉద్యోగ సంఘాలు. సీఎం క్యాంపు కార్యాలయానికి రానున్న సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. పీఆర్సీ, హెచ్ఆర్ఏ,…
ఏపీ ఉద్యోగుల HRA పెంపు వ్యవహారం ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. ఇప్పటికే రెండు దఫాలుగా జేఏసీల ఐక్యవేదిక ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. మరోసారి సీఎంఓ అధికారులతో సమావేశం అయిన ఉద్యోగ సంఘాల నేతలు. సీఎస్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంతృప్తి చెందడం లేదు. సీఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే అమరావతి పరిధిలో పని చేస్తున్న ఉద్యోగుల హెచ్ఆర్ఏ 30 శాతం నుంచి 8 శాతానికి…
గత ప్రభుత్వ హయాంలో జిల్లా హెడ్ క్వార్టర్ల వారీగా సాధించుకున్న హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లను సైతం ఇప్పుడు మార్చేయడం దారుణమని ఉద్యోగ సంఘాల జేఏసీల ఐక్య వేదిక నాయకులు పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు HRA ఖరారు పై ఇవాళ రెండు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపిన జేఏసీల ఐక్య వేదిక ప్రతినిధులు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల నిర్ణయం రాలేదన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సీఎస్ కమిటీ సిఫార్సులను అమలుచేస్తామని చెబుతుందన్నారు. Read Also: డేంజర్ బెల్స్..…
HRA , CCA, పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్ సౌకర్యాలను యధాతథంగా కొనసాగించాలని ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. దీనిపై వారు మాట్లాడారు. ఇప్పటికే సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మను కలిసిన జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావుతో పాటు ఇతర నేతలు ఉన్నారు. తమ డిమాండ్లను సీఎస్‌కు చెప్పారు. కాగా అమరావతి ఐక్యవేదిక నుంచి నేతలు వినతిపత్రం సమర్పించారు. Read Also: రైతు కష్టం తెలిసిన సీఎం కేసీఆర్: నామా నాగేశ్వరరావు ఉద్యోగులకు…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వంప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఆర్‌సీ విషయంలో గత కొన్ని నెలలుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీఆర్‌సీని 23.29 శాతం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ అమలుకానున్నట్లు…
ఎప్పటినుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీపై ఏపీ సీఎస్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు పీఆర్సీతో పాటు తమ న్యాయమైన 71 డిమాండ్లను కూడా పరిశీలించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం సీఎస్ నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏపీలో ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం నిరసనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా విజయవాడలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఆర్సీ సహా న్యాయమైన 71 డిమాండ్లను పరిష్కరిస్తేనే పోరాటం ఆపుతామని వారు స్పష్టం చేశారు. సచివాలయ…
పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలో ఉద్యోగ సంఘాల జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. మొత్తం 71 డిమాండ్లతో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. కర్నూలు, ఏలూరు, పాడేరు తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. కర్నూలులో ఉద్యోగ సంఘాలు నిర్వహించిన ఆందోళనల్లో ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. Read…
ఉద్యమ కార్యాచరణకు సిద్ధం చేసే సమయంలో నేను మాట్లాడిన మాటలను కొందరూ తప్పుగా అన్వయించారని, ప్రభుత్వాన్ని గద్దె దించుతామని నేను అనలేదని ఏపీ ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నేను అనని మాటలను అన్నట్టుగా ట్రోల్ చేసి ఉద్యమం పక్కదారి పట్టించేందుకు కొన్ని మాధ్యమాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. నాలుగు గోడల మధ్య జరిగిన సమావేశంలో మాటలను బయట పెట్టి రాజకీయం చేసేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమని బండి శ్రీనివాస్ అన్నారు.…