సీఎస్ సమీర్ శర్మపై మరోసారి విరుచుకుపడ్డారు పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ. ఉద్యోగుల తరపున సీఎంతో సంప్రదింపులు జరపాల్సిన వ్యక్తి సీఎస్సే. పీఆర్సీ విషయంలో సీఎస్ తన బాధ్యతల్లో విఫలమయ్యారని గతంలోనూ చెప్పా.. ఇప్పుడూ చెబుతున్నా అన్నారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ఉద్యమానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారుల సంఘం తరపున ప్రద్యుమ్న నన్ను తప్పు పట్టారు.సీఎస్ విషయంలో నేను వ్యక్తం చేసిన అభిప్రాయం నా ఒక్కడిదే కాదు.. పీఆర్సీ సాధన సమితి…
సీఎస్ కు సమ్మె నోటీసులు ఇచ్చిన తరవాత పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇది చాలా బాధాకరమైన రోజు. వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం అధికారుల కమిటీ మాటలనే వినింది. ప్రభుత్వం సమాజాన్ని తప్పుదోవ పుట్టిస్తోంది. ఈ నెల పాత జీతాలనే ఇవ్వండి అని కోరినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. ఇది ఆషామాషీ వ్యవహారం…
ఉత్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుంచి చర్చలు జరిపేందుకు సిద్ధంగ ఉన్నామని సంప్రదింపుల కమిటీ సభ్యులు సజ్జల రామకృష్ణ రెడ్డి, బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుండి ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తామన్నారు. దానిలో భాగంగా వారిని రావల్సిందిగా నిన్న సమాచారం ఇచ్చాం. జీవోలను అభయన్స్‌లో పెట్టాలని కోరారు. కమిటీని అధికారికంగా ప్రకటించే వరకు వచ్చేది లేదన్నారని వారు వెల్లడించారు. అయితే…
ఏపీలో పీఆర్సీ అంశం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇవాళ కోర్టులో పీఆర్సీ పై వాదనలు విన్న కోర్టు పూర్తి ఆధారాలతో రావాలని సూచించింది. కాగా సమ్మె నోటీసిచ్చే ఉద్యోగ సంఘ నేతలను హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాల నేతలేవ్వరూ కోర్టుకు హాజరు కాలేదు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పీఆర్సీ సాధన సమితి భేటీ అయింది. హైకోర్టు ఆదేశాలతో సమ్మె నోటీసును ఏవిధంగా ఇవ్వాలనే దానిపై…
ఏపీలో పీఆర్సీ అంశం ఇప్పట్లో తేలేలాలేదు. పలుమార్లు ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన ఉద్యోగులకు, ప్రభుత్వానికి పొంతన కుదరడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. పీఆర్సీ జీవోలను రద్దు చేసి వెంటనే చర్చలకు పిలవాలని ఏపీ ఏన్జీవో నేత విద్యాసాగర్ రావు అన్నారు. ఆదివారం విజయవాడలోని ఎన్జీవో హోంలో సమావేశమైన పలు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్న ఉద్యోగ సంఘాల…
పీఆర్సీపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ఏపీలో హీట్ పెంచాయి.. మరోసారి ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. ఇవాళ సమావేశమైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.. సోమవారం సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.. ఇవాళ సీఎస్‌ను కలిసి పాత జీతాలే ఇవ్వాలని కోరనున్నారు.. అయితే, ఉద్యోగులతో సంప్రదింపుల కోసం తాజాగా ఏపీ సర్కార్ మంత్రుల కమిటీని వేసింది.. మంత్రులు బుగ్గన, పేర్నినాని, బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్‌తో కమిటీ ఏర్పాటు చేసింది.. అయితే, ఇప్పుడు ప్రభుత్వం కమిటీ వేయడంపై…
అమరావతిలోని ఎన్జీవో హోంలో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు. ఇప్పటికే పీఆర్సీపై ప్రభుత్వంతో దేనికైనా సిద్ధం అంటూ ప్రకటనలు చేవారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇవాళ కేబినేట్ సమావేశం నిర్వహిస్తుంది. ఈ రెండు భేటీలు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే సమావేశానికి హాజరైన ఉద్యోగ సంఘ నేతలు వెంకట్రామిరెడ్డి, బండి, బొప్పరాజు, సూర్యనారాయణ. సచివాలయంలో కెబినెట్ జరుగుతోన్నందున్న ఉద్యోగ సంఘ నేతల సమావేశానికి ప్రభుత్వం అనుమతించలేదు. ప్రభుత్వ అనుమతి నిరాకరణతో ఎన్జీవో హోంలో భేటీ అయిన…
ఏపీ ఉద్యోగుల పీఆర్సీ అంశం ఇప్పట్లో తేలేలా లేదు. ఓవైపు ప్రభుత్వం ప్రస్తుతమున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించి వ్యవహరించాలని చెబుతున్నా ఉద్యోగులు మాత్రం అందుకు సంసిద్ధంగా లేరు. ఇప్పటికే ప్రభుత్వంతో పలు మార్లు చర్చలు జరిపిన అవేవి సఫలం కాలేదు. అటు ప్రభుత్వాన్ని, ఉద్యోగులను ఒకే తాటి మీదకు తీసుకురావాలని సీఎస్ సమీర్ శర్మ చేసిన ప్రయత్నాలన్ని బెడిసి కొట్టాయి. మంత్రులు సైతం పలు మార్లు ఉద్యగ సంఘాల నాయకులతో భేటీ అయినప్పటికీ పరిస్థితిలో మార్పు…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి స్పందించారు. కరోనాతో ఆర్థిక పరిస్థితులు దిగజారినా.. ఉద్యోగులు అడగ్గపోయినా సీఎం 27 శాతం ఐఆర్ ఇచ్చారని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఐఆర్ ఇచ్చి ఉండకపోతే ప్రభుత్వం రూ.18వేల కోట్ల భారం పడి ఉండేది కాదన్నారు. ఐఆర్ ఇవ్వకుండా ఉంటే పెండింగ్‌లో ఉన్న చిన్న కాంట్రాక్టు బిల్లులన్నీ ప్రభుత్వం చెల్లించి ఉండేదన్నారు. ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా చూస్తున్నామని… ఉద్యోగులను నష్టపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు.…
ఏపీలో పీఆర్సీ రగడ జరుగుతోంది. పీఆర్సీ జీవోల పై భగ్గు మంటున్న ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. జీవోలు రద్దు చేసే వరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళే ప్రసక్తే లేదు. మా డీఏలు మాకు ఇచ్చి జీతంలో సర్దుబాటు చేయడం ఉద్యోగులను మోసం చేయడమే అన్నారు. 10 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని సీఎస్ చెప్పిన లెక్కలన్నీ బోగస్ అని విమర్శించారు. కేంద్ర పే…