Scrutiny of Nomination Papers Today in AP: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామపత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. గురువారం (ఏప్రిల్ 25) మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల దాఖలు గడువు పూర్తయింది. ఈరోజు నామినేషన్ల స్క్రూట్నీై (నామినేషన్ల పరిశీలన) జరగనుంది. Also Read: YS Jagan Election Campaign: 28 నుంచి…
ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా మార్చి 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్.. బుధవారం (ఏప్రిల్ 24) శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద నిర్వహించిన సభతో ముగించారు. 22 రోజుల పాటు 23 జిల్లాలు, 86 నియోజకవర్గాల్లో 2,188…
కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పుత్తా కుటుంబం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. 15 ఏళ్ల తర్వాత కమలాపురం కోటపై టీడీపీ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గెలువగా.. 2014, 2019లో జగన్ మేనమామ పి. రవీంధ్రనాథ్ రెడ్డి వరుసగా 2 సార్లు గెలిచారు. మరోవైపు వరుసగా ఓడిపోయినా ప్రతి నిత్యం ప్రజల్లోనే ఉంటూ... ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, అందరికీ అందుబాటులో ఉంటున్నామని పుత్తా ఫ్యామిలీ చెబుతోంది.…
పాణ్యం నియోజకవర్గం మొత్తం పసుపుయంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితరెడ్డి నామినేషన్ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గౌరు అభిమానులు భారీ ర్యాలీగా వచ్చి కదం తొక్కారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు.. విద్యకు పెద్దపీట వేసి నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య అందజేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు కేశినేని శ్వేతా.
నా ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు.. మా వివేకం చిన్నానను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో, ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు సీఎం జగన్.. మా ఇద్దరి చెల్లెమ్మలను ఎవరు పంపించారో ప్రజలందరికీ తెలుసు.. వివేకం చిన్నానను అతి దారుణంగా చంపి బహిరంగంగా తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు..? అని ప్రశ్నించారు సీఎం జగన్