చిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదని స్పష్టం చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. అయితే, చిరంజీవి మద్దతు ఇవ్వడం మంచిదే.. కానీ, ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదు అని మాత్రమే చెప్పానన్నారు. చిరంజీవిని నేను విమర్శించా అని చెప్పడం ద్వారా కొంత మందిని అయిన దగ్గర చేసుకోవచ్చు అని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు అంటూ దుయ్యబట్టారు.
ఏలూరు జిల్లా కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు సమక్షంలో ఆటపాక గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. దాదాపు 200 మంది కార్యకర్తలకు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో జనాలకు మాయమాటలు చెబుతూ, మోసాలు చేస్తున్నారని అన్నారు. తమ వెనుకాల నిలబడకుంటే కుటుంబాలను సైతం బెదిరిస్తున్నారని తెలిపారు. ఆ బెదిరించే…
వాలంటీర్ల రాజీనామాతో మాకు సంబంధం లేదని హైకోర్టుకు తెలిపింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం.. ఇప్పటి వరకు 66 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్టు కోర్టుకు తెలిపిన ఈసీ.. 900 మందికి పైగా వాలంటీర్ల మీద చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది.. ప్రభుత్వంలో ఉంటే వాలంటీర్ల మీద చర్యలు తీసుకుంటామని రాజీనామా చేసిన వారి విషయంలో మేమే సర్క్యులర్ ఎలా ఇవ్వగలమని కోర్టుకు చెప్పింది.
గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. మంగళవారం పొదిలి మండలంలోని ఓబులక్కపల్లి, కొండాయపాలెం, సలకనూతల, దొడ్లేరు, మూగచింతల, భట్టువారిపాలెం, మాదిరెడ్డిపాలెం, నందిపాలెం గ్రామాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు.. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్యం 13 లక్షలు కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి.. ఒక్కోక్కరి తలపై 2 లక్షల రూపాయల అప్పు ఉంటుందని సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి, ఏప్రిల్ నెలల్లో గతంలో కంటే మద్యం అమ్మకాలు బాగా పెరిగాయి.. ముఖ్యంగా మార్చి నెలలోనే మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి.. ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు మార్చి మొదటి అర్ధ భాగంలోనే చాలా జిల్లాల్లో మద్యం సేల్స్ విపరీతంగా జరిగాయి.. అంటే చాలా చోట్ల మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి దాచారు అనడానికి ఈ అమ్మకాలు నిదర్శనంగా చెప్పచ్చు.. అదే ఏప్రిల్ నెల అమ్మకాలు చూస్తే కట్టడి చేసేందుకు చర్యలు పెంచడం, ఎక్కడికక్కడ సీజ్…
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేఆర్‌జే భరత్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్ యాత్ర విజయ యాత్రగా కనిపిస్తుందన్నారు.