విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పై ప్రజా తీర్పు కచ్చితంగా రిఫరెండమే అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై స్పందించారు.. అయితే, మూడు రాజధానులు అని ప్రకటించినా.. అమరావతికి మేం ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అమరావతితో పాటు వైజాగ్ నగరం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి…
ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల్లో ఓటమిపై పార్టీలో సుదీర్ఘంగా చర్చ జరగాలన్నారు. అడగకుండానే అన్నీ ఇచ్చినా.. ఎందుకు ప్రజల ఆదరణ లభించ లేదో తేల్చుకోవాలన్నారు. వ్యవస్థల్లో తెచ్చిన మార్పులు, సంస్కరణల కారణంగా పార్టీ కేడర్ కు గౌరవం దక్క లేదు.. నాయకత్వం, కేడర్ ను నిర్లక్ష్యం చేయాలనే ఉద్దేశం లేకపోయినా.. ప్రభుత్వం - పార్టీ మధ్య దూరం పెరిగిందన్నారు.
Venkatesh wish Pawan Kalyan after 2024 Win in AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. ఘన విజయం సాధించిన సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. స్టార్స్ అందరూ పవన్‌కు శుభాకంక్షాలు చెప్పారు.…
నేటితో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు మధ్యంతర బెయిల్ గడువు ముగియనుంది.. ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసుల్లో పిన్నెల్లిని అరెస్ట్ చేయవద్దు అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.. అయితే, కౌంటింగ్ నేపథ్యంలో ఇవాళ్టి వరకు అరెస్ట్ చేయవద్దని గతంలో ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు.
తిరుపతి ఎంపీ సీటుపై బీజేపీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచినా.. ఎంపీ సీటు ఓడిపోవడానికి గల కారణాలపై అన్వేషణ మొదలుపెట్టారు పార్టీ నేతలు.. దీనికి ప్రధాన కారణం.. కూటమి నుండి క్రాస్ ఓటింగ్ జరగడమే అనే నిర్ధారణకు వచ్చారట.
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్ రెడ్డి నెల రోజుల లోపు రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 74 మున్సిపాలిటీలలో వైసీపీ అధికారంలోకి రాగా.. తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రం టీడీపీ కైవసం చేసుకుంది.
ఎన్డీఏలో ఉండి కేంద్రం సపోర్టు చేస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ఎమ్మె్ల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్.. రాష్ట్ర నాయకులను కలిసి ముచ్చటించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా.. కామినేని శ్రీనివాస్ను రాష్ట్ర నాయకులు అంబికా కృష్ణ, జి. మధుకర్, వేటుకూరి సూర్యనారాయణ రాజు శాలువ కప్పి సత్కరించారు. ఈ క్రమంలో.. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ విజయం ప్రజలు ఇచ్చిన ప్రజావిజయం…
Supritha Celebrations Goes Viral After Pawan Kalyan Win: ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. అన్ని జిల్లాల్లోనూ క్లీన్‌స్వీప్ చేసింది. పిఠాపురం నుంచి బరిలో నిలిచిన సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల తేడాతో రికార్డు విజయం నెలకొల్పారు. పవన్ మాత్రమే కాదు.. జనసేన తరఫున పోటీ చేసిన మరో 20 మంది అభ్యర్థులు కూడా గెలుపొందారు. దాంతో…