ఏపీలో ఫలితాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. కూటమికి భారీ ఎత్తున సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం చతికల పడింది. దీంతో ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజీనామా చేశారు.
ఏపీలో వైస్సార్సీపీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. జనసేన పార్టీ 21 స్థానాలు నుంచి పోటీ చేసి 21 స్థానాల్లోనూ గెలవగా.. టీడీపీ 134 కంటే ఎక్కువ సీట్లు నుంచి గెలిచింది. బీజేపీ దగ్గర దగ్గరగా వైసీపీతో సమానంగా సీట్లను గెలుచుకుంది. ఈ ఓటమితో సీఎం జగన్ మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ తర్వాత తాజాగా పవన్ కళ్యాణ్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నేడు ఒక చారిత్రాత్మక రోజని ఆయన…
నేడు వెలబడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో టీడీపీ కూటమి రికార్డ్ స్థాయిలో స్థానాలను గెలుచుకుంది. ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకోవడంలో అనేక అంశాలు తోడ్పడ్డాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూటమిలో చేరడం, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తోడవడం లాంటి అనేక కారణాలు చాలానే ఉన్నాయి. అయితే వైఎస్ఆర్సిపి ఇంత భారీ ఓటమిని చవి చూడడానికి కూడా కారణాలు లేకపోలేదు. అయితే అవి ఏంటో ఒకసారి చూస్తే..…
Chiranjeevi Congratulates Pawan Kalyan oVer Victory: పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఆయనకు పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తోంది మెగా ఫ్యామిలీ నుంచి మెగా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ గెలుపు నేపథ్యంలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎన్డీఏ కూటమికి 150 పైగా సీట్లు వస్తాయని కేకే సర్వే అంచనా వేసిన సంగతి తెలిసింది. అయితే ఈ విషయంపై చాలామంది జోకులు కూడా వేశారు. అసలు ఎవరు ఈ కేకే.. అతనికి తెలిసిన విషయాలు ఏంటి.. ఏ నమ్మకంతో ఇంతటి సర్వేలను ఇస్తున్నాడు.. అంటూ అనేక విమర్శలు అతనిపై వచ్చాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం ఆయన వేసిన అంచనాలే కచ్చితంగా నిజమైనవని…
గుంటూరు పట్టణంలోని సాయిబాబా రోడ్డు దగ్గర మౌరియా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి విడదల రజినీ, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయాలపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున దాడులకు దిగారు.
ఏపీ ప్రజలకు మంచి చేయాలన్నదే తమ లక్ష్యం అని అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. విధ్వాంసానికి గురైన ఏపీని ఎలా బాగు చేయాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు. అప్పుడే కొందరు పారిపోవాలని చూస్తున్నారని, వారికి లుక్ ఔట్ నోటీసులు ఇవ్వాలన్నారు. గెలిచిన వారి నుంచి ఫోన్లు వస్తున్నాయని, వారిని రానిచ్చే పరిస్ధితి లేదని సీఎం రమేష్ పేర్కొన్నారు. అనకాపల్లి లోక్‌సభ నుంచి సీఎం రమేష్ గెలుపు దాదాపుగా ఖాయం అయింది. సీఎం రమేష్…
Venu Swamy took a sensational decision after YCP Defeat: సినీ సెలబ్రిటీలే కాకుండా రాజకీయ ప్రముఖుల మీద జ్యోతిష్యం చెబుతూ ఫేమస్ అయిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకనుంచి ఏ రాజకీయ ప్రిడిక్షన్స్ కానీ, సినిమా పరిశ్రమకు చెందిన వారి ప్రిడిక్షన్స్ కానీ సోషల్ మీడియాలో చెప్పను అని తెలిపాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందిన కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నా అని వేణు…
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీడీపీ గెలుపు దిశగా పయనిస్తుండగా.. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారాలోకేష్ ఘన విజయం సాధించారు.
Chandrababu Naidu will take oath as CM in Amaravati: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) విజయం దాదాపుగా ఖాయమైంది. 160కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. టీడీపీ రెండు సీట్లను గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారట. నాలుగోసారి సీఎంగా…