Pawan Kalyan Venkatesh: పిఠాపురం ఎమ్మెల్యే గారు.. పవన్ కల్యాణ్‌కు స్పెషల్ విషెస్ చెప్పిన వెంకటేష్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkatesh wish Pawan Kalyan after 2024 Win in AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. ఘన విజయం సాధించిన సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. స్టార్స్ అందరూ పవన్‌కు శుభాకంక్షాలు చెప్పారు. తాజాగా విక్టరీ వెంకటేష్ అభినందనలు చెప్పారు. ‘పిఠాపురం ఎమ్మెల్యే గారు’ అంటూ పవన్‌కు స్పెషల్ విషెస్ చెప్పారు.
‘చారిత్రాత్మక విజయం సాదించిన నా ప్రియమైన పవన్ కల్యాణ్‌కు అభినందనలు. ఇంతటి గొప్ప విజయాన్ని అందుకోవడానికి మీకంటే అర్హులు ఎవరూ లేరు మిత్రమా. నీరు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నా. మీ కృషి, శక్తి మరియు అంకితభావంను ఇలానే కొనసాగించండి. మీరు ప్రజలకు ఎనలేని సేవ చేయాలని కోరుకుంటున్నాను. పిఠాపురం ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు’ అని ఎక్స్‌లో విక్టరీ వెంకటేష్ పేర్కొన్నారు. ‘గోపాల గోపాల’ చిత్రంలో వెంకీ, పవన్ కలిసి నటించిన విషయం తెలిసిందే.
Also Read
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
Also Read: Aranmanai 4 OTT: ఓటీటీలో తమన్నా, రాశీఖన్నా ‘బాక్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. పొత్తుల్లో భాగంగా పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల తేడాతో రికార్డు విజయం సాధించారు. జనసేన నుంచి పోటీ చేసిన 21 మంది అభ్యర్థులు గెలుపొందారు. దాంతో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ మంత్రివర్గంలో చేరతారా? లేదా తన పార్టీ సభ్యులకే అవకాశమిచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా? అన్న దానిపై స్పష్టత లేదు. జనసేనాని తన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు తీసుకునే అవకాశముంది.
Congratulations dear @PawanKalyan on the historic win!! No one deserves this more than you, my friend. 🤗 May you soar to greater heights and continue to inspire with your hardwork, strength and dedication to serve people. Wishing you all the best, Pithapuram MLA garu ♥️
— Venkatesh Daggubati (@VenkyMama) June 5, 2024
తాజావార్తలు
-
Astrology: జాతకంలో శని శుభప్రదంగా ఉన్నప్పుడు.. జీవితంలో అద్భుతమైన మార్పులు.. ఇవే ఆ సంకేతాలు!
-
Prabhas Movies : డిసెంబర్ 3న ‘ఫౌజీ’ విడుదల.. ప్రభాస్‌ను నమ్మొచ్చా.. కన్ఫర్మ్గా వస్తాడా?
-
COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!