JC Prabhakar Reddy: మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా.. జేసీ సంచలన ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్ రెడ్డి నెల రోజుల లోపు రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 74 మున్సిపాలిటీలలో వైసీపీ అధికారంలోకి రాగా.. తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రం టీడీపీ కైవసం చేసుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. అయితే, మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనప్పుడు నాలుగు సంవత్సరాలలో మున్సిపల్ కౌన్సిలర్లను సంవత్సరానికి ఒకరు చొప్పున మున్సిపల్ చైర్మన్ గా.. మరికొంతమంది కౌన్సిలర్లను, మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంపిక చేస్తామని ప్రకటించారు. ఇక, 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారం కైవసం చేసుకోవడంతో తన మున్సిపల్ చైర్మన్ పదవికి నెల రోజుల్లోపు రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. గత ఐదు సంవత్సరాల్లో తాడిపత్రిలో కుంటపడిన అభివృద్ధిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.
Read Also: Hyderabad Metro: మెట్రో రైల్ లో సాంకేతిక లోపం.. తెరుచుకోని మెట్రో డోర్లు
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు