సుమారు 30 కోట్ల నుంచి 35 కోట్ల రూపాయలపైనే ఆ మధ్యవర్తి వద్ద పందాలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత పందాల్లో గెలిచిన వ్యక్తులు తమకు డబ్బులు వస్తాయని ఆనందంలో మునిగితేలారు.. ఎంతో ఆశగా పందెంలో గెలిచిన డబ్బు కోసం మధ్యవర్తి వద్దకు వెళ్తే ఆ మీడియేటర్ కాస్త అడ్రస్ లేకుండా పోయాడు.
ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సంచలన ఆరోపణలు చేశారు.. ఏపీ కాంగ్రెస్ అధిష్టానం కార్యకర్తలను అన్యాయం చేసిందన్న ఆమె.. నచ్చిన వారికి ఎన్నికల్లో పార్టీ ఫండ్ ఇచ్చారు.. ఎందుకు? వాళ్లు ఢిల్లీ వెళ్ళి షర్మిల భజన చేస్తారనా? అని నిలదీశారు..
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో పల్నాడుతో టెన్షన్ కొనసాగుతోంది. నరసరావు పేటలో పిన్నెల్లి ఉంటున్న గృహం చుట్టూ పోలీసులు మోహరించారు. కోర్టు ఆదేశాల ప్రకారం సంతకం చేసేందుకు కొద్దిసేపటి క్రితం ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మరోవైపు పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది.
చంద్రబాబు మారరు అనే అపవాదు తనపై ఉందని... కానీ మీరు మారిన చంద్రబాబును చూస్తారని.. ఇక అలా ఉండదని.. మీరే ప్రత్యక్షంగా చూస్తారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్టీ ఎంపీలతో జరిగిన భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద కోలాహలం నెలకొంది. చంద్రబాబు, లోకేష్, ఎన్టీఆర్ బ్యానరుకు 164 బిందెలతో పాలాభిషేకం చేశారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు.
ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం జరుగుతుందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. టీడీఎల్పీలో చంద్రబాబుని నేతగా ఎన్నుకుని గవర్నర్ కు నివేదిక పంపుతామన్నారు.
ఏపీలో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఎన్నికలు ముగిశాయి.. అందరూ చాలా కష్టబడ్డారని.. మా ఓటమిని అంగీకరిస్తున్నామని తాజా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి చేసుకొచ్చామని.. అయితే మరి కొన్ని మిగిలి ఉన్నాయని, వాటిని కొనసాగించాలని మా అభిప్రాయాన్ని చెబుతున్నామన్నారు.