CM YS Jagan: పథకాలన్నింటిని కొనసాగించాలంటే నిర్ణయించేది ఈ ఎన్నికలేనని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంటింటి అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మీ జగనే రావాలన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు అని.. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమేనన్నారు. చంద్రబాబు సాధ్యం కానీ హామీలు ఇచ్చాడని విమర్శించారు. ప్రధానమంత్రి మోడీ, అమిత్ షాతో చంద్రబాబు ఉమ్మడి సభలు పెట్టిస్తున్నాడన్నారు. మరి వాళ్లందరి దగ్గర నుంచి ప్రజలు ఏమి ఆశించారు.. మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కనీసం ఇప్పటికైనా వీళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగన్ రావాలి..
చంద్రబాబు నాయుడుకి ఏం కావాలి.. దత్తపుత్రుడికి ఏం కావాలి.. దుష్ట చతుష్టయానికి ఏమి కావాలి.. అని వాళ్లకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఇదే చంద్రబాబును నరేంద్ర మోడీ ఇంతటి అవినీతిపరుడు దేశంలోనే లేడు అన్నారని.. నేడు కూటమిలో చేరగానే అదే నోటితో ఇదే వ్యక్తిని మోడీ పొగిడారని సీఎం జగన్ అన్నారు. ఐదేళ్ల క్రితం ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన 99శాతం హామీలను అమలు చేశానని సీఎం చెప్పారు. మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీత తెచ్చింది మీ బిడ్డ అంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.