Chandrababu: విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ కార్యక్రమాలను పెంచుతానని.. ప్రజల ఆదాయన్ని పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ పేదవాళ్ల పార్టీ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. చీపురుపల్లిలో గంజాయి దొరుకుతుందని.. బొత్స సత్యనారాయణకు చేతనైతే గంజాయి లేకుండా చేయాలని ఆరోపించారు. విశాఖలో 40 వేల కోట్ల విలువ చేసే ఆస్తులను కబ్జా చేశారని.. విశాఖను గంజాయి హబ్‌గా మార్చేశారని విమర్శించారు. రేపు జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మాన్ని కాపాడాలని.. మన భవిష్యత్‌ను మనం పరి రక్షించుకోవాలన్నారు. ఓటు మీ హక్కు, మీ దగ్గర ఉండే ఆయుధమని, మీ జీవితాన్ని మార్చే ఆయుధమంటూ ఆయన పేర్కొన్నారు. అనుభవం అంతా ఉపయోగించి మీరు ఊహించని అభివృద్ధిని చేస్తా అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏమర పాటు వద్దని.. ఎండ ఉందని ఇంట్లో పడుకోవద్దు.. అందరూ ఓటు వేయాలని సూచించారు.
Read Also: AP High Court: డీబీటీ పథకాల అమలు.. తీర్పు రిజర్వు చేసిన ఏపీ హైకోర్టు
సూపర్ సిక్స్ పెట్టి మీ జీవితాల్లో వెలుగులు తీసుకువస్తామని ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. రోడ్లను అద్దంలా మారుస్తామన్నారు. తోటపల్లి పూర్తి చేసే బాధ్యత, చివరి భూమికి కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. కళా వెంకటరావును, కలిసెట్టి అప్పలనాయుడును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ సామాజిక బాధ్యత గలిగిన వ్యక్తి అని ఆయన అన్నారు. జనసేన ఇంఛార్జి శ్రీనివాసరావు కారు మీద దాడి చేశారని.. ఎవరైతే కార్యకర్తల జోలికి వస్తారో.. వారి సంగతి తేలుస్తామన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని.. ముందుకు వెళ్లాలని.. అవసరం అయితే సైకిల్‌తో తొక్కేయాలని కార్యకర్తలకు సూచించారు.