AP CEO: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకు ఒకసారి జరిగే ప్రజస్వామ్య వేడుకలో ప్రతి ఒక్క ఓటరు పాల్గొని రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు, ధృడమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పాదర్శకంగా జరిగే ఎన్నికలు ఎంతో కీలకమని, అటు వంటి ఎన్నికల్లో రాష్ట్రంలోని ఓటర్లు అంతా పాల్గొని ప్రజాస్యామ్య వ్యవస్థను పరిరక్షించు కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నేడు జరుగనున్న ఎన్నికల్లో మొత్తం 4,14,01,887 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, వీరిలో 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళలు మరియు 3,421 మంది ట్రాన్స్ జండర్స్ ఉన్నట్లు ఆయన తెలిపారు.
వీరంతా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిలో సమస్యాత్మకంగా గుర్తించిన 12,438 పోలింగ్ కేంద్రాల్లో మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 31,385 పోలింగ్ కేంద్రాలను అంటే 75 శాతం పోలింగ్ కేంద్రాలను పూర్తి స్థాయిలో లోపల, బయట కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిరంతరాయంగా పర్యవేక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంటరీ స్థానాలకు 454 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారని ఆయన తెలిపారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
PM Modi: మాతృదినోత్సవం సందర్భంగా మోడీకి గిఫ్ట్.. థ్యాంక్స్ చెప్పిన ప్రధాని
జీరో వయొలెన్సు లక్ష్యంగా రాష్ట్ర స్థాయి త్రిబుల్ “సీ”..
జీరో వయొలెన్సు లక్ష్యంగా రాష్ట్రంలోని 75 శాతం పోలింగ్ కేంద్రాలను అంటే 31,385 పోలింగ్ కేంద్రాలను నిరంతర వెబ్ కాస్టింగ్ ద్వారా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో పర్యవేక్షించడం జరుగుతున్నదన్నారు. 26 జిల్లాలకు సంబంధించి 26 టీవీ మానిటర్ల ద్వారా ఆయా జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఓటింగ్ సరళిని పోలింగ్ కేంద్రం లోపల, బయట కూడా పర్యవేక్షించడం జరుగుతున్నదన్నారు. ఇందుకు దాదాపు 150 మంది అధికారులు, సిబ్బందికి నిరంతరాయంగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
1.60 లక్షల ఈవీఎమ్లను ఉపయోగిస్తున్నాం..
నేడు రాష్ట్రంలో 46,389 పోలింగ్ కేంద్రాలలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 1.60 లక్షల కొత్త ఈవీఎమ్ లను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీటికి అదనంగా మరో 20 శాతం కొత్త ఈవీఎమ్లనుకూడా సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. నిజానికి మొదట్లో ప్రతిపాదించిన విధంగా 46,165 పోలింగ్ కేంద్రాలకు 1.45 లక్షల ఈవీఎంలు సరిపోతాయని, అయితే అదనంగా ప్రతి పాదించిన 224 ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాలకు మరో 15 వేల ఈవీఎంలు సమకూర్చుకున్నామన్నారు. మొత్తం మీద 46,389 పోలింగ్ కేంద్రాలలో 1.60 లక్షల కొత్త ఈవీఎమ్లను వినియోగిస్తున్నామన్నారు.
83 శాతం ఓటింగ్ లక్ష్యంగా చర్యలు..
రాష్ట్రంలో జరిగిన గత ఎన్నికల్లో 79.84 శాతం ఓటింగ్ నమోదు అయిందని, అయితే ఈ ఎన్నికల్లో 83 శాతం ఓటింగ్ లక్ష్యంగా విస్తృత స్థాయిలో ఓటర్లను చైతన్య పర్చే విధంగా పలు స్వీప్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించండం జరిగిందన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అప్రమ్తతం చేస్తూ దిన పత్రికల్లో ప్రకటనలను ప్రచురించడం జరుగుతున్నదన్నారు. అదే విధంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన కనీస వసతులైన త్రాగునీరు, వీల్ చైర్లు, ర్యాంపులు, ప్రథమ చికిత్స సేవలు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. పురుషులకు, మహిళలకు వేరు వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేయడమే కాకుండా అవసరాన్ని బట్టి వృద్దులకు, దివ్యాంగులకు కూడా ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!