AP Elections 2024: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.. వీటిలో వై. రామవరం మండలంలోని గుర్తెడు, పాతకోట నుండి ఈవీఎం, వీవీ ప్యాట్‌లను రంపచోడవరంలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించడానికి హెలికాప్టర్ ను సిద్ధం చేశారు. రంపచోడవరం నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 399 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రంపచోడవరం నియోజవర్గంలో 2 లక్షల 77 వేల. 317 ఉండగా ఇందులో పురుషులు లక్ష 31 వేల 901, స్త్రీలు లక్ష 14 వేల 540 , థర్డ్ జెండర్స్ 16 ఓటర్లు ఉన్నారు. రంపచోడవరం జూనియర్ కళాశాల గ్రౌండ్ ఏర్పాటు చేసిన శిబిరంలో అధికారులకు పోలింగ్ మెటీరియల్ అందజేస్తున్నారు . బస్సుల్లో ఈవీఎం బాక్స్ లను సిబ్బందితో తరలిస్తున్నారు. 3 వేల మంది సిబ్బంది ఎన్నికల విధులకు హాజరయ్యారు. కాగా, ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపబడగా.. మరి కొన్ని గంటల్లో అంటే.. రేపు ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానున్న విషయం విదితమే.
Read Also: India-China: చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుదలపై విదేశాంగ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు