ఎన్నికలపై సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బుంటేనే ఎన్నికలలో పోటీ చేయాలి అన్నట్లు వ్యవస్థ మారిపోయిందన్నారు. ప్రస్తుత రాజకీయాలు గౌరవప్రదంగా లేవన్నారు.
మూడో రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్‌తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారులకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉండనుంది..
జగన్ లాంటి పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేసేవాన్ని వదిలేసి చంద్రబాబు లాంటి దుర్మార్గున్ని తెచ్చుకొని కొరివితో తల గోక్కుంటామా అని ప్రజలే అంటున్నారు.. ప్రశాంత్ కిషోర్ సొంత పార్టీ పెట్టాలని ఆశ ఉంది.. బీజేపీని ఓడించడానికి దేశంలోని నాయకుల అందరిని అనుసంధానం చేశాడు.. అది బెడీసీ కొట్టింది అని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు గుప్పించారు.
అన్ని వర్గాల అవసరాలను తీర్చే పాలనను ముఖ్యమంత్రి జగన్ ఇస్తున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర పేర్కొన్నారు. వైఎస్సార్ కంటే రెండడుగులు ముందుకు వేసి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆయన అన్నారు. ఎలాంటి సిఫారసు లేకుండా అర్హులందరికీ వారి ఖాతాల్లో నేరుగా లబ్ధిని అందిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే అభ్యర్థుల ఖరారును వేగవంతం చేశారు. తాజాగా అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు చేస్తోంది.
ఏపీలో రెండో రోజు కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తోంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశమైంది. తొలి రోజున 18 జిల్లాల సమీక్ష జరగగా.. ఇవాళ 8 జిల్లాలపై సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ నెలలోనే ఎన్నికలంటూ సీఈసీ సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం.