Kakani Govardhan Reddy: జగన్ సీఎం అయ్యాక పారదర్శకంగా సేవల్ని అందిస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy Interesting Comments On Sahakara Banks: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పారదర్శకంగా సేవలను అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల సభ్యులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సహకార సంఘాలను పటిష్టం చేస్తున్నామన్నారు. సీఎం జగన్ సహకార రంగంలో వినూత్న సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలోని 13 కేంద్ర సహకార బ్యాంకులు లాభాల బాటలో ఉన్నాయన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్న కర్నూలు, కడప జిల్లాల కేంద్ర సహకార బ్యాంకులు.. ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తున్నాయన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వైద్యనాథన్ కమిటీ సిఫారసులను అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం నాబార్డు కన్సల్టెన్సీ సంస్థ సిఫారసులను ఆమోదించి.. బ్యాంకులకు సీఎం జగన్ పెట్టుబడి అందించారన్నారు. అదే విధంగా.. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను కూడా ఆర్థికంగా పటిష్టం చేస్తామన్నారు.
China: ఎటు చూసినా ముసలోళ్లే.. గగ్గోలు పెడుతున్న డ్రాగన్ కంట్రీ
Also Read
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
- Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
- President Droupadi Murmu: లఖ్పతి దీదీలు కాదు.. కరోడ్పతి దీదీలుగా ఎదగాలి.. రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
అంతకుముందు.. రాబోయే ఎన్నికల్లోనూ వైఎస్ జగన్ గెలుస్తారని, మళ్లీ సీఎం అవుతారని కాకాని ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్‌లో ఉన్నాడని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ అవమానకరంగా మాట్లాడుతున్నారని, వాలంటీర్లలో 70 శాతం ఉన్న మహిళల మనోభావాలను గాయపరుస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ నాలుగు చోట్ల పోటీ చేసినా గెలవలేడంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మనస్తత్వం తెలుసు కాబట్టే.. ఆయన పేరును కూడా సీఎం జగన్ ఉచ్ఛరించరని అన్నారు. పవన్ ప్యాకేజీలకు అమ్ముడు పోయే వ్యక్తి కాబట్టే ఆయన్ను దత్తపుత్రుడు అంటారని సెటైర్లు వేశారు.
Kishan Reddy: తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రజాధనాన్ని కొల్లగొట్టింది.. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు
తాజావార్తలు
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!