Janasena: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే అభ్యర్థుల ఖరారును వేగవంతం చేశారు. తాజాగా అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు చేస్తోంది. నియోజకవర్గాల వారీగా పవన్ కళ్యాణ్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 15-20 నియోజకవర్గాల్లో సమీక్షలు పూర్తి అయినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సమీక్షలు నిర్వహిస్తున్నారు. విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని వివిధ నియోజకవర్గాలపై పవన్ సమీక్షలు నిర్వహించారు. ఇవాళ మరికొన్ని నియోజకవర్గాలపై సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పోటీ చేసేందుకు అవకాశం ఉన్న నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Read Also: AP Elections 2024: ఏప్రిల్ నెలలోనే అసెంబ్లీ ఎన్నికలు!.. కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం భేటీ
పోటీ చేసేందుకు అవకాశం ఉన్న నియోజకవర్గాలపై సమీక్ష..?
సమీక్షలు పూర్తైన సెగ్మెంట్లు..:
నెల్లిమర్ల, భీమిలి, పెందుర్తి, యలమంచిలి.
సమీక్షలు పూర్తైన సెగ్మెంట్లు..:
కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, రాజానగరం, రాజోలు, అమలాపురం.
సమీక్షలు పూర్తైన సెగ్మెంట్లు..:
అవనిగడ్డ, పెడన, బందరు.
సమీక్షలు పూర్తైన సెగ్మెంట్లు..:
గుంటూరు వెస్ట్, నరసరావు పేట
సమీక్షలు పూర్తైన సెగ్మెంట్లు..:
చీరాల, గిద్దలూరు, తిరుపతి.