Central Election Commission: నేడు ఏపీకి కేంద్ర ఎన్నికల కమిషన్.. మూడు రోజుల పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Election Commission: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పర్యటనకు సిద్ధమైంది కేంద్ర ఎన్నికల కమిషన్.. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ ఏపీలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. ప్రతిపక్ష టీడీపీకి కూడా పోటాపోటీగా కేంద్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదు చేశాయి.. దీంతో.. రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది సీఈసీ.. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన కొనసాగనుంది.. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన కొనసాగనుంది.. ఈ రాత్రికి విజయవాడ చేరుకోనుంది ఎన్నికల అధికారుల బృందం.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్ల పర్యటన కొనసాగనుంది..
Read Also: Manchu Lakshmi : ముంబైలో మంచు లక్ష్మీ ఇల్లు ఎంత బాగుందో చూశారా?.. వీడియో వైరల్..
Also Read
ఇక, ఈ పర్యటనలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు వివిధ రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల కమిషనర్ సమావేశం కానుంది.. ఓటర్ల జాబితాలో అవకతవకలు, పార్టీల ఫిర్యాదులపై రాష్ట్ర సీఈవోతో సమీక్ష చేయనుంది సీఈసీ.. అనంతరం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ సమీక్ష సమావేశం నిర్వహించనుంది. మరోవైపు.. ఎన్నికల సన్నద్ధతపై ఈ నెల 10న ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు సీఈవో.. ఎన్నికల కమిషన్, కేంద్ర విభాగాలు, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతోనూ సీఈసీ భేటీ కానుంది. ఈనెల 10న సాయత్రం 4.30 గంటలకు సీఈసీ, కమిషనర్ల మీడియా సమావేశం నిర్వహించనుండగా.. అదే రోజు ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానుంది కేంద్ర ఎన్నికల బృందం.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు